రాకెట్లు- ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఛైర్మన్ కే. శివన్ వెల్లడించారు. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్‌లో కూడా ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్ నేషనల్ స్పేస్, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అన్న కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది.
ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇస్రో కార్యకలాపాలు తగ్గవని శివన్ స్పష్టం చేశారు. ఆధునిక పరిశోధన- అభివృద్ధి, మానవసహిత అంతరిక్ష యాత్ర సహా అన్ని పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- అంతరిక్ష పోటీలో ప్రైవేటు భాగస్వామ్యం పాత్ర ఏంటి?