ETV Bharat / bharat

'చెన్నై-వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి యోచన'

రక్షణ పరికరాల ఉత్పత్తి సహా వివిధ అంశాల్లో భారత్​-రష్యా మధ్య సహకారం కొనసాగుతుందని ఇరు దేశాల అగ్రనేతలు నరేంద్రమోదీ, వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్​లో జరుగుతున్న తూర్పు ఆర్థిక సమాఖ్య సమావేశం వేదికగా మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ సహా పలు అంశాల్లో ఇరుదేశాల మధ్య  అవగాహన కుదిరింది.

author img

By

Published : Sep 4, 2019, 3:58 PM IST

Updated : Sep 29, 2019, 10:22 AM IST

'చెన్నై-వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి యోచన'

రష్యాలోని వ్లాదివోస్తోక్​లో జరుగుతున్న తూర్పు ఆర్థిక సమాఖ్య(ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం) వేదికగా భారత్ ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం అయ్యారు. రక్షణ, అణు కార్యక్రమం, చెన్నై, వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి ప్రణాళికలు సహా పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది.

సమావేశం అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

భారత్-రష్యా మధ్య చమురు, గ్యాస్ మాత్రమే కాదు... హైడ్రోకార్బన్ సెక్టార్​లో అవగాహన ఉందన్నారు మోదీ. ఈ రంగంలో సహకారం కోసం ఐదేళ్ల రోడ్​మ్యాప్​పై అవగాహన కుదిరిందన్నారు. అంతరిక్షంలో ఇరుదేశాల మధ్య ఏళ్లుగా ఉన్న అవగాహన కారణంగా నూతన శిఖరాలకు చేరుకుంటున్నామన్నారు మోదీ.

సమావేశంలో ప్రసంగిస్తున్న మోదీ

"2001లో ఇరుదేశాల మధ్య పుతిన్, వాజ్​పేయీలు మొట్టమొదటగా సమావేశం అయ్యారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో భారత బృందంలో సభ్యుడిగా ఉన్నాను. ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. రక్షణ వంటి వ్యూహాత్మక విభాగంలో రష్యా సహకారంతో భారత్​లో ఉపకరణాల తయారీకి నేడు కుదిరిన అవగాహన ఒప్పందం పరిశ్రమలకు ఊతమిస్తుంది. భారత్​లో రష్యా సహకారంతో నిర్మిస్తున్న అణు రియాక్టర్లు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. మన దేశాల మధ్య సంబంధాలను రాజధానులకు పరిమితం చేయకుండా ఇరు దేశాల ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. వజ్రాలు, ఖనిజాలు, వ్యవసాయం, కలప, పల్ప్, పేపర్​, పర్యటకం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. దేశాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు చెన్నై, వ్లాదివోస్తోక్​ మధ్య సముద్రమార్గానికి యోచిస్తున్నాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగం, విద్య, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహకర ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

విక్టరీ డే దినోత్సవానికి మోదీకి ఆహ్వానం..

2020లో మాస్కో వేదికగా జరగనున్న గ్రేట్ పాట్రియాట్రిక్ వార్ 75వ వార్షికోత్సవానికి మోదీని ఆహ్వానించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

"నాజీలపై గెలుపును పురస్కరించుకుని... వచ్చే ఏడాదిలో మే మాసంలో జరగనున్న గ్రేట్ పాట్రియాట్రిక్ వార్​ 75వ వార్షికోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం."

-మోదీతో వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

ఇదీ చూడండి: రష్యా అత్యున్నత పౌర పురస్కారంపై మోదీ కృతజ్ఞతలు

Mumbai, Sep 04 (ANI): Bollywood Actress Kareena Kapoor was spotted outside Aamir Khan and Kiran Rao's residence in Mumbai. Dressed in white kurta, Bebo looked stunning. Kareena Kapoor and Aamir Khan will next be seen in the movie 'Lal Singh Chaddha'. They were last seen together in super hit film '3 Idiots'.
Last Updated : Sep 29, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.