శబరిమలలో సోమవారం మరో ప్రధాన ఘట్టాన్ని నిర్వహించారు అర్చకులు. మూలవిరాట్‌కు పుష్పాభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు దీపారాధన ప్రారంభమైంది. మల్లెపూలు, తామర, గులాబీ సహా వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. యాలకులు, వట్టివేర్లతో చేసిన మాలలతో అలంకరించారు.
భక్తులు పుష్పాభిషేకం చేసేందుకు రూ. 10వేల ధరతో టికెట్లు విక్రయించారు. పూజకు అవసరమైన పువ్వులను వారే సమకూర్చి పూజలు జరిపిస్తారు. వట్టివేర్ల మాలను కూడా మూలవిరాట్‌కు ధరింపజేసిన అనంతరం భక్తులకు అందించారు. పుష్పాభిషేక టికెట్టు కొన్నవారికి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ఆలయం తెరిచిన తర్వాత వచ్చే మలయాళ మాసం నుంచి భక్తులు ఈ ప్రత్యేక పూజను నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?