నవమాసాలు మోసిన తల్లే ఆరేళ్ల చిన్నారి పాలిట మృత్యువైంది. కేవలం బామ్మపై ప్రేమ చూపినందుకు బాలుడి ప్రాణాలు తీసింది.
అత్తపై కోపంతో...
అత్తాకోడళ్ల పంచాయితీలు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటాయి. పంజాబ్ జలందర్ జిల్లాలోని సోహల్ జాగిర్ గ్రామానికి చెందిన కుల్విందర్ కౌర్ కు కూడా, అత్తంటే గిట్టేది కాదు. కుల్విందర్ భర్త సుర్జీత్ సింగ్ ఇటలీలో ఉంటాడు. దీంతో అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగేవి. కానీ, కుల్విందర్ ఆరేళ్ల తనయుడికి మాత్రం నాయనమ్మ అంటే పంచప్రాణాలు. అదే కుల్విందర్ ను హంతకురాలిగా మార్చింది.
అత్తతో గొడవైన రాత్రి.. తనయుడిపై మండిపడింది. తనకంటే ఎక్కుగా తన అత్తను ప్రేమించడం జీర్ణించుకోలేకపోయింది. ఉద్రేకంలో కూరగాయలు తరిగే కత్తితో చిన్నారిని పొడిచేసింది. ఆపై ఇంట్లోనుంచి పారిపోయింది.
ప్రస్తుతం పోలీసులు కుల్విందర్ పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా వల్ల కొత్త సమస్య.. పెరుగుతున్న నిద్రలేమి బాధితులు