మహారాష్ట్ర పుణెలోని పరిశోధకులు, విద్యావేత్తల బృందం నానో మెటీరియల్‌తో.. హ్యాండ్‌వాష్‌ను తయారు చేసింది. నీటిలో కలిపి ఉపయోగించే క్రిమిసంహారకాన్ని అభివృద్ధి చేసింది. ఇది పర్యావరణహితమే కాక, పూర్తిగా విషరహితమని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధన బృందానికి జున్నర్లోని శ్రీ శివ్ ఛత్రపతి కళాశాలకు చెందిన డా. రవీంద్ర చౌదరి నేతృత్వం వహించారు. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(సీమెట్) మాాజీ డైరెక్టర్ జనరల్ డా.దినేశ్ అమల్ నేర్కక్ సహకారంతో వీటిని అభివృద్ధి చేశారు.
" కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సబ్బు, నీరు, ఆల్కహాల్‌తో తయారు చేసిన శానిటైజర్లు ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. సబ్బుతో వైరస్ కారక సూక్ష్మ జీవులు పూర్తిగా నాశనం కాకపోవచ్చు. శానిటైజర్లలో మండే పదార్థం ఉండటమే కాక, తరచూ ఉపయోగిస్తే చర్మంపై ప్రభావం పడుతుంది. అందుకే పర్యావరణహిత, బాక్టీరియాపై అత్యంత ప్రభావం చూపే హ్యాండ్‌వాష్, క్రిమిసంహారకాన్ని తయారు చేశాం".
-డా.దినేశ్ అమల్నేర్కక్, సీమెట్ మాాజీ డైరెక్టర్ జనరల్
క్రిమిసంహారకంలో విషపూరిత పదార్థాలు లేనందున నీటిలోని చేపలపై ప్రభావం పడే అవకాశం లేదని పరిశోధకులు రవీంద్ర చౌదరి తెలిపారు.
ఆల్కహాల్‌ను 70 శాతం వరకు ఉపయోగించవచ్చని.. సోడియం హైపోక్లోరైట్ బ్లీచ్ ద్రావణం చవక అయినప్పటికీ వాటిని ఉపయోగిస్తే శ్లేష్మ పొర దెబ్బతింటుందన్నారు అమల్నేర్కర్. పండ్లు, కూరగాయలు, మాంసం వంటి ఆహార పదార్థాలను వాటితో శుభ్రం చేయలేమన్నారు. కానీ తాము తయారు చేసిన క్రిసిసంహారకంతో.. ఆహార పదార్థాలను కూడా శుభ్రం చేసుకోవచ్చని చెప్పారు.