పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి హతమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి.
ట్రాల్ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురిలో జైషే మహ్మద్ (జెమ్) తీవ్రవాది ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ 'మోహ్ద్ భాయ్' ఉన్నాడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన ముష్కరులను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు.
ట్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రమూకలు ఉన్నాయన్న నిఘా సంస్థల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన జవాన్లు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.
ఇదీ చూడండీ: కశ్మీర్లో కాల్పులు...ముగ్గురు తీవ్రవాదులు హతం