యావత్ దేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దక్షిణ కశ్మీర్, పుల్వామా సమీపంలోని హడ్కీపొరలో నివసిస్తున్న పీర్ తారీఖ్, అతడి కుమార్తె ఇంషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. దాడితో ఆ ఇద్దరికీ సంబంధం ఉన్నట్లు తెలిపింది ఎన్ఐఏ.
2019 ఫిబ్రవరి 14న కారులో మానవబాంబుగా వచ్చి సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి.. 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నాడు ఆదిల్ అహ్మద్ దార్. ఆ మానవబాంబు ఆదిల్‌కు పీర్, ఇంషా సహకరించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది ఎన్ఐఏ. జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర సంస్థ చివరిసారిగా విడుదల చేసిన ఆదిల్ వీడియోను పీర్ ఇంట్లో చిత్రీకరించినట్లు తేల్చింది.
వీడియో ఆధారంగా ఇంషాను, ఆమె తండ్రి పీర్ తారీఖ్‌ను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ.
ఇదీ చదవండి:పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు