పటేల్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు అభినవ్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న తన కుమారుడు పబ్జీ ఆడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని తండ్రి రాజేశ్ జయంత్ పోలీసులను ఆశ్రయించాడు.
" మా కుమారుడు పబ్జీ ఆడేవాడు. ఇది ఓ వినూత్నమైన ఆట. ఈ ఆట ఆడే మా అబ్బాయి ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పబ్జీ నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. "
రాజేశ్ జయంత్, అభినవ్ తండ్రి.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అతనికి చెందిన వస్తువులను, ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. అభినవ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
" సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల కుర్రాడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడు పబ్జీ ఆడతాడని మా దర్యాప్తులో తేలింది. ఇంటి నుంచి వెళ్లేముందు ఫోను తీసుకెళ్లినట్లు తెలిసింది. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. "
- కుమార్, ఘజియాబాద్ జిల్లా ఎస్పీ.
పబ్జీ ఆటను ఓ వ్యసనంగా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఆటపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ ఆటను దేశవ్యాప్తంగా నిషేధించాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం గుజరాత్లో ఈ ఆటపై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే పబ్జీ ఆడుతూ కనిపించిన చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.