దేశవ్యాప్తంగా వలస కార్మికుల ఇబ్బందులకు సంబంధించి భారతీయ రైల్వే పాత్రపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. లాక్డౌన్ అమల్లో ఉన్నా రైల్వే శాఖ టికెట్ బుకింగ్లు ఎందుకు కొనసాగించిందని ప్రశ్నించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
దేశంలోని వేర్వేరు చోట్ల చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు ప్రియాంక.
"దేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా పేదలు, కూలీలకే ఇబ్బంది ఎదురవుతుంది ఎందుకు? నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రభుత్వం వారిని ఎందుకు పరిగణించదు? వారిని ఎందుకు అలా విస్మరిస్తారు? లాక్డౌన్ ఉన్నా రైల్వే టికెట్ బుకింగ్ ఎందుకు కొనసాగించారు?
వారి కోసం ప్రత్యేక రైళ్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? వారి దగ్గర డబ్బులు లేవు. నిత్యావసరాలు లేవు. వారంతా అభద్రతా భావంతో ఉన్నారు. స్వస్థలాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా సరైన ప్రణాళికతో వారికి సాయం చేయొచ్చు."
-ప్రియాంక గాంధీ
వలస కార్మికుల సంక్షోభానికి సంబంధించి రైల్వే శాఖ పాత్రపై దర్యాప్తునకు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్.
ఇదీ చదవండి: లాక్డౌన్ 2.0: ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?