ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో నేడు ప్రియాంక 'కిసాన్​ పంచాయత్​' - యూపీ కిసాన్ పంచాయత్

ఉత్తర్​ప్రదేశ్​లో కిసాన్​ పంచాయత్​ కార్యక్రమానికి కాంగ్రెస్​ బుధవారం శ్రీకారం చుట్టనుంది. సహరన్​పుర్​ వేదికగా జరగనున్న కార్యక్రమంలో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. సాగు చట్టాలకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఈ ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది.

Priyanka to attend 'kisan panchayat' in Saharanpur on Wednesday: UP Congress
యూపీ 'కిసాన్​ పంచాయత్​'లో పాల్గొననున్న ప్రియాంక
author img

By

Published : Feb 10, 2021, 6:02 AM IST

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో.. ఉత్తర్​ప్రదేశ్​లో 'జై జవాన్​.. జై కిసాన్​' ఉద్యమాన్ని కాంగ్రెస్​ పార్టీ బుధవారం ప్రారంభించనుంది. ఇందులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కీలకంగా వ్యవహరించనున్నారు. సహరన్​పుర్​ వేదికగా జరగనున్న కిసాన్​ పంచాయత్​లో ఆమె పాల్గొంటారు. ఈ విషయాన్ని యూపీ కాంగ్రెస్​ మీడియా కన్వీనర్​ లలన్​ కుమార్​ వెల్లడించారు.

రాష్ట్రంలో 10రోజుల పాటు ఈ 'జై జవాన్​.. జై కిసాన్​' ఉద్యమం జరగనుంది. మొత్తం 27 జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్​ నేతలు కూడా పాల్గొననున్నట్టు లలన్​ కుమార్​ తెలిపారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే రైతులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్​.. ఈ 10రోజుల కార్యక్రమంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పట్టు సాధించాలని భావిస్తోంది.

ఇదీ చదవండి : సాగు చట్టాలపై ఐటీసీ, అమూల్​తో నిపుణుల బృందం చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.