కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో ఏడాదిలో 359 రోజులపాటు సెక్షన్ 144 విధించారని.. మోదీ మాత్రం ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"2019లో 359 రోజులపాటు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సెక్షన్ 144 విధించారు. మరోవైపు ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరంలేదని మోదీ చెబుతున్నారు?"- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ట్వీట్
వారణాసిలో 359 రోజుల పాటు సెక్షన్ 144 విధించినట్లు బెనారస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆరోపించారు. దీనినే ఓ మీడియా రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ ప్రియాంక గాంధీ మోదీపై విమర్శలు సంధించారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) ప్రకారం, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఓ ప్రాంతంలో నలుగురికి పైగా వ్యక్తులు సమావేశం కావడాన్ని నిషేధించవచ్చు.
ఇదీ చూడండి: విధుల్లో జవాన్ మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య