ETV Bharat / bharat

'పౌర చట్టం, ఎన్​ఆర్​సీతో పేదలకే ఎక్కువ నష్టం'

author img

By

Published : Dec 20, 2019, 10:33 PM IST

Updated : Dec 20, 2019, 11:37 PM IST

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తోన్న నిరసనలో పాల్గొన్నారు. పౌరచట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్​ఆర్​సీతో పేదలకు ఎక్కువ నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

priya
'పౌర చట్టం, ఎన్​ఆర్​సీతో పేదలకే ఎక్కువ నష్టం'

భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఇండియా గేట్ వద్ద విద్యార్థుల నేతృత్వంలో జరుగుతున్న పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు తమ గుర్తింపుగా ఏ రుజువు చూపగలరని కేంద్రం లక్ష్యంగా ప్రశ్నాస్త్రాలు సంధించారు ప్రియాంక.

"దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరచట్టం, దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రాథమికంగానే పేదలకు వ్యతిరేకం. దీనివల్ల అత్యంత ఎక్కువగా పేదలపై భారం పడుతుంది. దేశాన్ని ఏ స్థితిలోకి నెట్టేస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు లైన్లలో నిల్చోబెట్టిన విధంగా ఇప్పుడు ఎన్​ఆర్​సీ కోసం నిల్చునే పరిస్థితి వస్తోంది. ధనికులైతే పాస్​పోర్ట్ చూపిస్తారు. కానీ పేదలు, రోజుకూలీలు ఏం చూపిస్తారు."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి

తాను నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని తెలిపారు ప్రియాంక. ఆందోళనలు శాంతియుతంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రియాంక వెంట కుమార్తె మిరయా ఉన్నారు.

ఇదీ చూడండి: 'పౌర' జ్వాల: ఆందోళనలతో దద్దరిల్లిన దిల్లీ

New Delhi, Dec 20 (ANI): Reacting to West Bengal Chief Minister Mamata Banerjee's demand that impartial organisation like United Nations should conduct a referendum on CAA in India, MoS for Home Affairs G Kishan Reddy called it an irresponsible statement. "The base of Trinamool Congress is slipping away, that is why she is tense and what she is saying even she doesn't know. This is an irresponsible statement from a CM," said G Kishan Reddy.

Last Updated : Dec 20, 2019, 11:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.