ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారు. ఇందుకోసం ఆమె ఇప్పటికే... లఖ్‌నవూ చేరుకున్నారు. ఇటీవల కొంత మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో... రాష్ట్ర పార్టీ కేడర్‌ను బలోపేతం దిశగా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంకా.. పార్టీ సలహాదారుల మండలి, వ్యూహాత్మక బృంద సమావేశాలకు హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి జీపీఏ పార్కు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ప్రదర్శన చేయాలని యోచిస్తోంది. కానీ సెక్షన్ 144 విధింపు కారణంగా.. ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
అల్లర్ల అనంతరం తొలిసారి...
ఇటీవల మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రియాంక గాంధీ... షాహీద్ స్మారకం నుంచి జీపీఏ పార్కు వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హింసాత్మక నిరసనల అనంతరం.. తొలిసారి యూపీలో పర్యటించనున్నారు ప్రియాంక. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 19మంది మరణించారు.
పౌర ఆందోళనల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లాలని ప్రయత్నించిన ప్రియాంక, రాహుల్ గాంధీలను గత ఆదివారం మేరఠ్‌లో పోలీసులు అడ్డుకున్నారు.