దేశంలో ప్రైవేటు రైళ్లకు సంబంధించి మరిన్ని విధాన అంశాలను రైల్వే వెల్లడించింది. ఛార్జీలు నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఆపరేటర్లకే ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక అవి ఏయే స్టేషన్లలో ఆగాలో నిర్ణయించేది కూడా ప్రైవేటు ఆపరేటర్లేనని తాజాగా చెప్పింది.
అయితే ఆ స్టేషన్ల వివరాలను ముందుగానే రైల్వేకు తెలియజేయాలి. స్టేషన్ల వారీగా వచ్చే, వెళ్లే సమయాలు ముందుగా చెప్పాలి. కనీసం ఏడాది పాటు అదే షెడ్యూలు పాటించాలి.