ETV Bharat / bharat

త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

author img

By

Published : Mar 17, 2020, 7:19 PM IST

Updated : Mar 17, 2020, 10:52 PM IST

కరోనా పరీక్షల సామర్థ్యం పెంచడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తుండగా... ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. గుర్తింపు పొందిన 60 ప్రైవేటు ల్యాబ్​లను కొవిడ్ పరీక్షలకు అనుమతించనున్నట్లు సమాచారం.

Private NABL-accredited labs will soon be operationalised for coronavirus tests: ICMR
త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు
త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

దేశంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వేగంగా పరీక్షలు నిర్వహించడానికి ఇకనుంచి ప్రైవేటు ల్యాబ్​ల​లోనూ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన ప్రైవేట్​ ల్యాబ్​లలో కొవిడ్ పరీక్షలు చేసేందుకు అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. అనుమానితులు పెరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ముందుజాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

"ప్రభుత్వ గుర్తింపు పొందిన దాదాపు 60 ల్యాబ్​లలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించనున్నాం. ల్యాబ్​ల పేర్లు ఇంకా నిర్ణయించలేదు. వీటి విధివిధానాలను రూపొందిస్తున్నాం."

-కేంద్ర వైద్య శాఖ అధికారులు

'ప్రభుత్వ సామర్థ్యంపై సందేహం లేదు'

అయితే ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ల్యాబ్​ల సామర్థ్యంపై సందేహం లేదని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రేసెర్చి(ఐసీఎంఆర్)​ సాంక్రమిక రోగాల విభాగాధిపతి రమణ్ ఆర్​ గంగాఖేడ్కర్​ పేర్కొన్నారు. 52 ల్యాబ్​లలో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రోజుకు 600 నమూనాలు పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. 60 వేల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని... మరో రెండు లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ఉచితంగానే పరీక్షించండి

ఐసీఎంఆర్​కు చెందిన 72 లేబరేటరీల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నట్లు డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరో 49 ల్యాబ్​లు ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రైవేట్​ ల్యాబ్​లకు అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ల్యాబ్​లు సైతం ఉచితంగానే కరోనా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థించారు.

ఎవరెవరికి పరీక్షలు?

ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారు, కరోనా సోకిన వ్యక్తులతో దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తులను 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి... కొవిడ్ లక్షణాలు కనబరిస్తేనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే సామూహిక వ్యాప్తి భయాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు చేయని వారికీ తాజాగా వైరస్ పరీక్షలు ప్రారంభించారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్నవారిని పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు 1,040 మందికి ఇటువంటి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్​గా తేలలేదని ఐసీఎంఆర్​ అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా కేసులు@137.. సర్వం బంద్​!

Last Updated : Mar 17, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.