ETV Bharat / bharat

'ఆత్మనిర్భర శంఖారావంతో ప్రపంచానికి మన శక్తిని చాటుదాం'

author img

By

Published : Aug 15, 2020, 6:49 AM IST

Updated : Aug 15, 2020, 9:21 AM IST

Prime Minister Narendra Modi will unfurl the national flag
ఎర్రకోట వేదికగా మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

09:02 August 15

'ఆత్మనిర్భర భారతంతో ఆరోగ్య భారత్​'

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వేదికగా సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర భారత్​, ఆరోగ్య భారత్​ సహా.. లద్దాఖ్​ ఘటన, అయోధ్య భూమిపూజ, ఆరేళ్లలో సాధించినవి, జల్​జీవన్​ మిషన్​, సంస్కరణలు, ప్రాజెక్టులు, కరోనాపై పోరాటం, వ్యాక్సిన్​ సంబంధిత విషయాలపై మాట్లాడారు.

'వోకల్​ ఫర్​ లోకల్​'

ప్రసంగమంతటా ఆత్మనిర్భర్​ భారత్​ గురించే ప్రధానంగా ప్రస్తావించిన నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్​ భారత్​ దేశప్రజలందరి సంకల్పం కావాలని ఉద్ఘాటించారు. లోకల్​ కోసం వోకల్​గా మారాల్సిన తురణం ఆసన్నమైందని నొక్కిచెప్పారు. రవాణా హెలికాప్టర్ల నుంచి రైఫిళ్ల వరకూ భారత్​లోనే తయారీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్​ ఎందులోనూ తక్కువకాదని నిరూపించాలన్నారు. భారత వస్తువులను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పారు.

ప్రతి పౌరుడికి హెల్త్​ ఐడీ

కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రతి పౌరుడి ఆరోగ్యంపై దృష్టి సారించేలా హెల్త్​ ఐడీ జారీ చేస్తామని చెప్పారు మోదీ. ఇందుకోసం డిజిటల్​ హెల్త్​ మిషన్​ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాక్సిన్​పై..

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై పనిచేస్తున్నాయని అన్నారు ప్రధాని. అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. 

కరోనా వ్యాక్సిన్​ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని చెప్పిన ప్రధాని.. తయారీ ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 3 వ్యాక్సిన్​ క్యాండిడేట్లు వివిధ దశల్లో ప్రయోగాలు జరుపుకుంటున్నాయని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

లద్దాఖ్​ గుణపాఠం..

తూర్పు లద్దాఖ్​లో జరిగింది ప్రపంచం చూసిందని.. సరిహద్దు దాటాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే లద్దాఖ్​ గుణపాఠం గుర్తుంచుకోవాలని శత్రుదేశాలకు హెచ్చరికలు పంపారు.  

గడిచిన ఆరేళ్లలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపిన మోదీ.. మధ్యతరగతి జీవితాన్ని మార్చినట్లు ఉద్ఘాటించారు. 

08:58 August 15

'మాటల్లో కాదు.. చేతల్లో చూపాల్సిన సమయమిది'

  • భారత్‌.. ప్రపంచంలో ఎవరికన్నా తక్కువ కాదు: ప్రధాని
  • ప్రపంచస్థాయి ఉత్పత్తులకు భారత్‌ కేంద్రం కానుంది: ప్రధాని
  • ఉత్తమ ఉత్పత్తుల దేశంగా భారత్‌ ఎదుగుతోంది: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపాల్సిన సమయం ఆసన్నమైంది: ప్రధాని
  • మనందరం లోకల్‌ కోసం వోకల్‌గా మారాలి: ప్రధాని
  • మన ఉత్పత్తులకు తగిన మార్కెట్‌ను మనమే సృష్టించుకోవాలి: ప్రధాని
  • మన వస్తువులకు మనం గౌరవమిస్తేనే ప్రపంచం గౌరవమిస్తుంది: ప్రధాని
  • 21వ శతాబ్దం మన కలలను సాకారం చేసే దిశగా సాగాలి: ప్రధాని
  • మన యువత ఆత్మనిర్భర శంకారావంతో ప్రపంచానికి మన శక్తిని నిరూపించాలి: ప్రధాని

08:57 August 15

'రామమందిర పునాది- జనుల సుహృద్భావానికి తార్కాణం'

  • పది రోజుల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది వేశాం: ప్రధాని
  • అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభాన్ని జాతియావత్తూ సుహృద్భావంతో ఆహ్వానించింది: ప్రధాని
  • జాతిజనుల మధ్య సయోధ్య, సుహృద్భావానికి ఇది గొప్ప తార్కాణం: ప్రధాని
  • సుహృద్భావ జీవనంపై భారత్‌ ప్రపంచానికి చూపిన మార్గదర్శకమిది: ప్రధాని

08:54 August 15

'అండమాన్​లోనూ అంతర్జాలం'

సముద్ర తీరంలోని 1300 ద్వీపాలను అభివృద్ధి చేస్తున్నాం: ప్రధాని

చెన్నై నుంచి సముద్ర అంతర్భాగ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ నిర్మాణం ప్రారంభించాం: ప్రధాని

దిల్లీ, చెన్నై మాదిరిగానే అండమాన్‌లోనూ అంతర్జాల సౌకర్యం ఉంటుంది: ప్రధాని

సముద్ర తీర ప్రాంతాల్లో నూతన ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ కల్పిస్తాం: ప్రధాని

తీరప్రాంతంలో ఉన్న ఎన్‌సీసీ క్యాడెట్లను నావికాదళం పర్యవేక్షిస్తుంది:ప్రధాని

భూ సరిహద్దు కలిగిన ప్రాంతాల్లోని ఎన్‌సీసీ క్యాడెట్లను సైన్యం పర్యవేక్షిస్తుంది: ప్రధాని

08:52 August 15

దేనికైనా భారత్​ రెడీ: మోదీ

  • వస్తువుల దిగుమతి నిషేధించాం: ప్రధాని
  • భారత్‌ తయారీలో భాగంగా రవాణా హెలికాప్టర్ల నుంచి రైఫిళ్ల వరకు సొంతంగా తయారు చేయాలని సంకల్పించాం: ప్రధాని
  • హిమాలయాల నుంచి సముద్రతీరం వరకు ఏ ఆపదనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ప్రధాని
  • లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు రోడ్ల నిర్మాణం వేగవంతం చేశాం: ప్రధాని

08:50 August 15

'పశ్చిమాసియా దేశాలు అత్యంత ప్రాధాన్యం'

పొరుగు దేశాలతో కలిసి పనిచేసేందుకు స్నేహ హస్తం అందిస్తున్నాం: ప్రధాని

దక్షిణాసియాలోని ప్రతి దేశంతో భారత్‌ కలిసి పనిచేయాలని కోరుకుంటోంది: ప్రధాని

పరస్పర గౌరవం, అభివృద్ధిలో భాగస్వాములవుతారని విశ్వసిస్తోంది: ప్రధాని

పశ్చిమాసియా దేశాలతో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాం: ప్రధాని

పశ్చిమాసియాలోని ప్రతి దేశం భారత్‌కు అత్యంత ప్రాధాన్యమైనదే: ప్రధాని

తూర్పు ఆసియా దేశాలతోనూ భారత్‌ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకుంది: మోదీ

వేలాది సంవత్సరాలుగా సముద్రతీర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది: ప్రధాని

తీర సరిహద్దులే కాదు సముద్ర సంపదల వృద్ధిలోనూ తూర్పు ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తున్నాం: ప్రధాని

08:47 August 15

'ప్రపంచ దేశాలతో భారత్​ స్నేహబంధం'

  • విస్తరణవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి భారత్‌ పోరాటం చేస్తోంది: ప్రధాని
  • భారత్‌ పోరాటానికి ప్రపంచం అండగా నిలబడడమే మన నైతికతకు నిదర్శనం: ప్రధాని
  • బలమైన భారత నిర్మాణమే మన ముందున్న కర్తవ్యం: ప్రధాని
  • భారత్‌ పొరుగు దేశాలతో నిరంతరం సుహృద్భావ సంబంధాలనే కోరుకుంటోంది: ప్రధాని
  • పరస్పర విశ్వాసం, గౌరవంతోనే సంబంధాలు ఉండాలని కోరుకుంటోంది: ప్రధాని
  • భూమి, సముద్ర సరిహద్దులు కలిగిన అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను భారత్‌ కోరుకుంటోంది: ప్రధాని
  • దక్షిణాసియాలోని దేశాలు, రాజ్యాధినేతలందరినీ సుహుద్భావ సంబంధాల కోసం స్నేహ హస్తం అందిస్తున్నాం: ప్రధాని

08:42 August 15

'శత్రుమూకలకు లద్దాఖ్​ గుణపాఠం!'

  • దేశ సరిహద్దులను దాటే ప్రయత్నం చేసే ఎవరికైనా ఒక్కటే సమాధానం: ప్రధాని
  • మన సైన్యం సరిహద్దులు దాటేవారికి తగిన గుణపాఠం నేర్పింది: ప్రధాని
  • దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే లద్దాఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుంది: ప్రధాని
  • లద్దాఖ్‌లో ఏం జరిగిందో ప్రపంచం చూసింది: ప్రధాని

  • భారత్‌ పోరాటానికి ప్రపంచం అండగా నిలబడడమే మన నైతికతకు నిదర్శనం

08:39 August 15

  • పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది: ప్రధాని
  • పునరుత్పాదక ఇంధన వనరుల్లో మరింత ముందుకు వెళ్లేందుకు నిరంతర ప్రయత్నం: ప్రధాని
  • దేశంలోని వంద నగరాల్లో కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టాం: ప్రధాని

08:36 August 15

'370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో అభివృద్ధి'

  • 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైంది: ప్రధాని
  • జమ్ముకశ్మీర్‌లో మహిళలు, ఎస్సీలకు తొలిసారి హక్కులు లభించాయి: ప్రధాని
  • లద్దాఖ్‌లో నూతన అభివృద్ధికి శ్రీకారం చుట్టాం: ప్రధాని
  • సిక్కిం తరహాలో లద్దాఖ్‌, లేహ్‌, కార్గిల్‌ను సంపూర్ణ సేంద్రీయ ప్రాంతాలుగా మారుస్తాం: ప్రధాని
  • సంపూర్ణ సేంద్రీయ ప్రాంతాలుగా మారుస్తాం: ప్రధాని

08:32 August 15

'వ్యాక్సిన్​ కోసం శాస్త్రవేత్తల కృషి'

  • కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని ప్రతి ఒక్కరూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు
  • కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రయత్నాలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి
  • మన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ శ్రమించి వ్యాక్సిన్‌ రూపొందించే పనిలో ఉన్నారు
  • వీలైనంత త్వరగా దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందే ప్రయత్నాలు జరుగుతున్నాయి: ప్రధాని

08:32 August 15

కరోనా తొలినాళ్లలో దేశంలో రోజూ 3 వేల పరీక్షలు మాత్రమే చేయగలిగాం: ప్రధాని

అతికొద్ది కాలంలో రోజూ 7 లక్షల పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నాం: ప్రధాని

దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలు, వెల్‌నెస్‌ సెంటర్లు

ఇవాళ్టి నుంచి జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభిస్తున్నాం

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా జాతి ప్రజలందరినీ కొత్త ప్రయోజనాలు తీసుకువస్తున్నాం

ప్రతి పౌరుడికీ ప్రత్యేక నంబర్‌తో కార్డు ఏర్పాటు చేస్తున్నాం

పౌరులకు అందిన వైద్యం వివరాలు కార్డులో పూర్తిగా నిక్షిప్తమై ఉంటాయి: ప్రధాని

08:30 August 15

మహిళల్లో పోషకాహార లోపాలకు స్వస్తి పలికే ప్రయత్నాలు ప్రారంభించాం: ప్రధాని

స్త్రీల వివాహ వయసుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం: ప్రధాని

08:23 August 15

'ప్రతి గ్రామానికీ ఆప్టికల్​ ఫైబర్​ నెట్​'

అంతర్జాల విప్లవాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది

2014 నాటికి కేవలం 5 డజన్ల పంచాయతీలకు మాత్రమే అంతర్జాల సౌకర్యం ఉండేది: ప్రధాని

ఆరేళ్లలో లక్షన్నర గ్రామాల అంతర్జాలం అందుబాటులోకి తెచ్చాం: ప్రధాని

ప్రతి గ్రామానికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది: ప్రధాని

ఆరు లక్షల గ్రామాలకు వేలకొద్ది కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ను తీసుకెళ్తున్నాం: ప్రధాని

వచ్చే వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికి ఆప్టికల్‌ ఫైబర్‌ విస్తరిస్తాం: ప్రధాని

అంతరిక్ష రంగంలో భారత్‌ కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది: ప్రధాని

ప్రతి అంశంలోనూ ఆత్మనిర్భరత కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం

పెరుగుతున్న అవసరాలతో పాటు సైబర్‌ రంగంలో అనేక ఇబ్బందులు: ప్రధాని

సైబర్‌ నేరాల కట్టడికి నూతన ఆవిష్కరణల అవసరం ఉంది: ప్రధాని

08:21 August 15

'నూతన విద్యా విధానంతో ప్రపంచ పౌరులుగా భారత యువత'

  • స్వయం సమృద్ధ భారత్‌ సాధించాలంటే విద్యా విధానం అత్యంత ప్రధానం: ప్రధాని
  • నూతన విద్యా విధానంతో భారత యువతను ప్రపంచ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం: ప్రధాని
  • నూతన విద్యా విధానంలో జాతీయ పరిశోధన నిధి ఏర్పాటు చేశాం: ప్రధాని
  • దేశం ముందుకు సాగేందుకు నూతన ఆవిష్కరణలు, నవ కల్పనలు నిరంతరం సాగాలి: ప్రధాని
  • నవకల్పనలే నవశకానికి నాంది పలుకుతాయి: ప్రధాని
  • పరిశోధన నిధి ద్వారా నవ కల్పనలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం: ప్రధాని

08:18 August 15

'మధ్యతరగతి ప్రజల సొంతిల్లు స్వప్నం సాకారం'

  • భారతీయ మధ్య తరగతి ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించింది: ప్రధాని
  • భారతీయ వృత్తి నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు: ప్రధాని
  • ప్రభుత్వ బంధనాల నుంచి మధ్యతరగతిని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాం: ప్రధాని
  • జీఎస్టీ ద్వారా చాలా వస్తువులపై పన్నులు తగ్గిపోయాయి: ప్రధాని
  • మధ్యతరగతి ప్రజల సొంతిల్లు స్వప్నం సాకారం చేస్తున్నాం: ప్రధాని

08:16 August 15

'జల్​జీవన్​తో ఆరోగ్య రంగంలో పెను మార్పు'

దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీటి కోసం నిరంతర ప్రయత్నం సాగుతోంది: ప్రధాని

స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం చెప్పవచ్చు: ప్రధాని

జల్‌జీవన్‌ మిషన్‌తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది: ప్రధాని

జల్‌జీవన్‌ మిషన్‌ వల్ల సామాన్య ప్రజలు అనారోగ్యం నుంచి బయటపడుతున్నారు: ప్రధాని

తాగునీరు అందించడానికి కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై పనిచేస్తున్నాయి: ప్రధాని

08:13 August 15

రైతులకు చేయూత..

వ్యవసాయ మార్కెటింగ్‌లో నూతన శకానికి నాంది పలికాం: ప్రధాని

ప్రభుత్వ బంధనాల నుంచి రైతులను విముక్తి చేస్తున్నాం: ప్రధాని

రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం: ప్రధాని

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాం: ప్రధాని

రైతులే స్వయంగా ఆహార శుద్ధికి ముందుకు వచ్చేలా చేస్తున్నాం: ప్రధాని

వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విలువల జోడింపునకు అధిక ప్రాధాన్యం: ప్రధాని

08:12 August 15

'యువత ఉపాధికి కొత్త పథకాలు'

పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల వృద్ధి.. కొత్త ఉపాధిని సృష్టించింది: ప్రధాని

పట్టణాల్లో చిరు, వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాల ద్వారా అస్తిత్వాన్ని అందించాం: ప్రధాని

దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించాం: ప్రధాని

వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం నూతన పథకాలు ప్రారంభించాం: ప్రధాని

యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి కొత్త పథకాలు తీసుకువస్తున్నాం: ప్రధాని

08:08 August 15

'ఆరేళ్లలో ఎంతో చేశాం'

గడిచిన 6 ఏళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుకు అనేక పథకాలు తెచ్చాం: ప్రధాని

బ్యాంకు ఖాతాలు, రేషన్‌ పంపిణీ, నగదు బదిలీ చేపట్టాం: ప్రధాని

ఒకే కార్డు ఒకే దేశం వంటి అనేక పథకాలు తీసుకువచ్చాం: ప్రధాని

కష్టకాలంలో ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు చేరాయి: ప్రధాని

ఉచిత గ్యాస్‌, ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మందిని ఆకలి నుంచి దూరం చేశాయి: ప్రధాని

08:03 August 15

'మౌలిక వసతుల అభివృద్ధికి వేల ప్రాజెక్టులు'

  • దేశవ్యాప్తంగా నూతన మౌలిక వసతుల అభివృద్ధికి 7 వేల ప్రాజెక్టులను ప్రారంభించాం: ప్రధాని
  • ఈ 7 వేల ప్రాజెక్టులు అనేక పరిశ్రమలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి: ప్రధాని
  • వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది: ప్రధాని
  • స్వర్ణ చతుర్భుజి లాంటి మౌలిక సదుపాయాలే మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తున్నాయి: ప్రధాని
  • రోడ్లు, రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి, అనుసంధానం ప్రారంభించాం: ప్రధాని
  • నూతన అనుసంధానం వ్యాపార, వాణిజ్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది: ప్రధాని
  • గడిచిన 6 ఏళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుకు అనేక పథకాలు తెచ్చాం: ప్రధాని

08:00 August 15

ఎఫ్​డీఐల్లో భారత్​ కొత్త పుంతలు..

మనం యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం

ఆహార ఉత్పత్తి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ కొత్త అవకాశాలు సృష్టించే ప్రయత్నాలు: మోదీ

వ్యవసాయ రంగం నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించాం: ప్రధాని

ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ కొత్త పుంతలు తొక్కుతోంది: ప్రధాని

ఎఫ్‌డీఐల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించాం: ప్రధాని

ఎఫ్‌డీఐల్లో వృద్ధి ప్రపంచం మనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం: ప్రధాని

మన ప్రజాస్వామ్య విలువలు, నిబద్ధత భారత్‌ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి: ప్రధాని

అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తోంది: ప్రధాని

07:57 August 15

''వోకల్​ ఫర్​ లోకల్​'ను నిలబెట్టుకుందాం'

  • ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది: ప్రధాని
  • మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం: ప్రధాని
  • కరోనా కష్ట కాలంలో కూడా మనం కొత్త దారులు వెతుక్కుందాం : ప్రధాని
  • పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది: ప్రధాని
  • నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించిన ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం: ప్రధాని
  • వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే మాటను నిలబెట్టుకుందాం: ప్రధాని
  • మన వస్తువులను మనమే గౌరవించకపోతే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది: ప్రధాని
  • మనందరం మన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పిద్దాం: ప్రధాని

07:53 August 15

  • మన శక్తిని ప్రపంచ అవసరాలకనుగుణంగా మలుచుకోవాలి: ప్రధాని
  • ఇంకా ఎంత కాలం ముడిపదార్థాల ఎగుమతిదారుగా మిగిలిపోదాం: ప్రధాని
  • ప్రపంచానికి కావాల్సిన వస్తు ఉత్పత్తిని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేద్దాం: ప్రధాని
  • ఆధునిక కావాల్సిన వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్‌ భారత్‌: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే మన రైతులు నిరూపించి చూపారు: ప్రధాని
  • భారత్‌ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు: ప్రధాని
  • మన రైతులే ప్రేరణగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాదిద్దాం: ప్రధాని
  • భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం: ప్రధాని
  • భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం: ప్రధాని

07:52 August 15

  • భారత్‌ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం: ప్రధాని
  • ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు: ప్రధాని
  • ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ప్రపంచంతో మరింత మమేకం కావడం: ప్రధాని
  • మన శక్తిని నమ్ముకుని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి: ప్రధాని

07:50 August 15

'ఆత్మనిర్భర్​ భారత్​ మనందరి సంకల్పం'

ఈ క్షణం స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలి: ప్రధాని

ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం నినాదం కాదు: ప్రధాని

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి: ప్రధాని

భారత యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి: ప్రధాని

07:49 August 15

'క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటై నిలబడిన దేశం'

  • కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది: ప్రధాని
  • 25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంత కాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటుంది: ప్రధాని
  • 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది: ప్రధాని
  • ఈ క్షణం స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలి: ప్రధాని

07:47 August 15

ప్రపంచమంతా భారత్​ బాటలో...

  • విస్తరణవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి భారత్‌ కొత్త దారి చూపింది: ప్రధాని
  • ప్రపంచమంతా భారత్‌ చూపిన బాటలో నడిచి కొత్త ప్రపంచానికి నాంది పలికాయి: ప్రధాని
  • స్వాతంత్య్ర సంగ్రామ నిరంతర ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది: ప్రధాని
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సిద్ధమైంది: ప్రధాని

07:44 August 15

  • అనేక భాషలు, సంస్కృతులు, రాజ్యాలు, సంస్థానాలతో కూడిన జాతి ఒక్కటై స్వాతంత్య్ర సంగ్రామంలో నిలిచింది: ప్రధాని
  • భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీపశిఖ: ప్రధాని
  • స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అనేక దేశాలకు ప్రేరణగా నిలిచింది: ప్రధాని

07:43 August 15

'75 ఏళ్లు పూర్తయ్యే లోపు మరో అడుగు ముందుకు..'

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేకం సాధించాం: ప్రధాని

ఇంకా మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం: ప్రధాని

75 ఏళ్లు పూర్తయ్యే సరికి మరో అడుగు ముందుకేస్తాం: ప్రధాని

ప్రాణాలు త్రుణప్రాయంగా వదిలి మన పూర్వులు స్వాతంత్య్రం తెచ్చిపెట్టారు: ప్రధాని

07:41 August 15

'చుట్టుముట్టిన విపత్తులు.. ఏకమై ఎదుర్కొందాం'

  • ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు: ప్రధాని
  • కరోనా ఒకటే కాదు.. దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టుముట్టాయి: ప్రధాని
  • కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి: ప్రధాని
  • సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుదృఢం చేస్తాయి: ప్రధాని

07:38 August 15

వైద్యులకు ప్రణామం..

కరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది: ప్రధాని

కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం: ప్రధాని

వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషిచేస్తున్నారు: ప్రధాని

07:35 August 15

సైనికులు, పోలీసులకు వందనం: మోదీ

భారతీయ రక్షణ దళాలు, పోలీసు దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి: ప్రధాని

దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు, పోలీసులకు వందనం: ప్రధాని

ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితుల్లో పయనిస్తోంది: ప్రధాని

07:24 August 15

జాతీయ పతాకం ఆవిష్కరణ..

ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోట వేదికపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

07:22 August 15

ఎర్రకోటకు మోదీ..

దిల్లీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

ఎర్రకోటలో భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ

07:16 August 15

రాజ్​ఘాట్​ వద్ద జాతిపితకు మోదీ నివాళి..

దిల్లీ రాజ్​ఘాట్​ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి ఘననివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాసేపట్లో రెడ్​ ఫోర్ట్​ చేరుకొని.. జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. 

07:11 August 15

ఎర్రకోటకు తరలిన ప్రముఖులు..

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా.. ఎర్రకోటకు చేరుకున్నారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​, మహాదళాధిపతి బిపిన్​ రావత్​. 

07:06 August 15

ముమ్మర తనిఖీలు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. రెడ్​ ఫోర్ట్​ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతా సిబ్బంది. 

07:03 August 15

మోదీ శుభాకాంక్షలు..

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. హిందీ, ఆంగ్లంలో ట్వీట్​ చేశారు. 

06:53 August 15

సుందరంగా ముస్తాబైన ఎర్రకోట..

ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ జెండా ఎగురవేయనున్న నేపథ్యంలో ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొవిడ్​ దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులకు అనుమతి ఉంది. విధిగా థర్మల్​ స్క్రీనింగ్​ చేస్తున్నారు భద్రతా సిబ్బంది.   

06:32 August 15

వ్యాక్సిన్​పై మోదీ క్లారిటీ.. వీలైనంత త్వరలో ప్రజలందరికీ!

74వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సర్వం సిద్ధమైంది. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం.. ఏం మాట్లాడుతారా అని అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

ప్రధాని మోదీ ఈ ఉదయం 7 గంటల సమయంలో రాజ్‌ఘాట్‌కు చేరుకొని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. 7 గంటల 18 నిమిషాలకు ఎర్రకోటకు చేరుకొని భద్రతాదళాల గౌరవవందనం స్వీకరిస్తారు. ఏడున్నర సమయంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. అ తర్వాత.. మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య వేడుకను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా.. దిల్లీ సహా ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 

Last Updated : Aug 15, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.