ETV Bharat / bharat

కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - modi corona meet

Prime Minister Narendra Modi
వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
author img

By

Published : Nov 24, 2020, 11:46 AM IST

Updated : Nov 24, 2020, 12:03 PM IST

11:52 November 24

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో సమావేశమయ్యారు. కరోనా కేసులపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, హర్షవర్దన్​తో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు పాల్గొన్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నా కొన్ని నగరాల్లో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న చర్యలను మోదీ అడిగి తెలుసుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, వీలైనంత త్వరగా, సమర్థంగా పంపిణీ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దేశంలో ఐదు వ్యాక్సిన్లు తుది దశకు చేరుకున్నాయి. అందులో నాలుగు రెండు, మూడు ప్రయోగ పరీక్షల దశల్లో ఉన్నాయి. ఒకటి ఒకటి రెండు ప్రయోగ పరీక్షల దశలో ఉంది. 

కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ గతంలో పలుమార్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల  సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.

11:32 November 24

వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశమవుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ భేటీ జరగనుంది.

Last Updated : Nov 24, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.