ETV Bharat / bharat

ప్రపంచ వాతావరణ సదస్సులో నేడు మోదీ ప్రసంగం

పారిస్​ వాతావరణ ఒప్పందానికి ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, లక్ష్యాలపై మోదీ ప్రసంగిస్తారు.

Modi
ప్రపంచ వాతావరణ సదస్సులో మోదీ ప్రసంగం
author img

By

Published : Dec 12, 2020, 5:31 AM IST

Updated : Dec 12, 2020, 6:12 AM IST

ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. పారిస్​ వాతావరణ ఒప్పందానికి నేటితో ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో వర్చువల్​గా ఈ సదస్సు జరగనుంది. ఈ మేరకు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు.

"వాతావరణ మార్పు ఈ రోజు జరిగింది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి క్రమంగా ఈ మార్పు వస్తోంది. ప్రపంచ ఉద్గారాల్లో అమెరికా 25 శాతం, ఐరోపా 22 శాతం, చైనా 13 శాతంతో పోలిస్తే భారత్​ కేవలం 3 శాతంతో ఎంతో బాధ్యాతాయుతంగా నడుచుకుంటోంది. భారత్..​ పారిస్​ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. అంతకుమించి చేస్తోంది.

- ప్రకాశ్​ జావడేకర్​, పర్యావరణ శాఖ మంత్రి

ప్రారంభ ఉపన్యాసం..

ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్​ఐసీసీఐ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు.

Last Updated : Dec 12, 2020, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.