ETV Bharat / bharat

'నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు' - బిహార్​ ఎన్నికలు

బిహార్​లో రూ.14వేల కోట్లు విలువైన 9 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆప్టికల్​ ఫైబర్​ ఇంటర్​నెట్​ సేవలనూ ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వ్యవసాయంలో సంస్కరణల కోసమే ఇటీవల పార్లమెంట్​లో బిల్లులు తెచ్చామని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

Prime Minister Narendra Modi
బిహార్​లో 9 హైవే ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
author img

By

Published : Sep 21, 2020, 12:33 PM IST

Updated : Sep 21, 2020, 2:24 PM IST

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు.. 21వ శతాబ్దపు భారత దేశానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిహార్‌లో రూ.14,258 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు దృశ్యమాధ్యమం ద్వారా ప్రధాని శంకుస్థాపన చేశారు.

అనంతరం బిహార్‌లోని 45,945 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఘర్‌తక్‌ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించారు.

మంచి జరిగింది...

కేంద్రం కొత్తగా తెచ్చిన సాగు బిల్లులు.. వ్యవసాయ మార్కెట్లకు వ్యతిరేకం కాదని మోదీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలలో రైతులు తమ పంట ఉత్పత్తులకు సంబంధించి మెరుగైన రేట్లను పొందుతున్నారని ప్రధాని వివరించారు.

కరోనా సంక్షోభంలోనూ రికార్డుస్థాయిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశామన్నారు. కనీస మద్దతు ధర, పంట సేకరణ ప్రక్రియలు యథాతథంగా కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు.

  • #WATCH Yesterday, two farm bills were passed in Parliament. I congratulate my farmers. This change in farming sector is the need of the present hour & our govt has brought this reform for farmers. I want to make it clear that these Bills is not against agriculture mandis: PM Modi pic.twitter.com/3GrtOYfXUw

    — ANI (@ANI) September 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశ ప్రజలకు, రైతులకు, భారతదేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షించే వారందరికీ శుభాకాంక్షలు. ఈ బిల్లులు 21వ శతాబ్దంలో అవసరం. ఈ చట్టాల ద్వారా రైతులు అనేక బాధల నుంచి విముక్తులవుతారు. ఈ చట్టాలు, బిల్లులు వ్యవసాయ మార్కెట్లకు వ్యతిరేకం కాదు. దేశంలోని వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించే ప్రక్రియను ఎన్డీఏ సర్కారు కొనసాగిస్తుంది.

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఇటీవలే బిహార్​లో రైల్వే, వంతెనలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మోదీ. వచ్చే అక్టోబర్​-నవంబర్​లో బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ ప్రాజెక్టులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Sep 21, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.