ETV Bharat / bharat

'2024 నాటికి రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం' - దిల్లీ

దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలే లక్ష్యాలుగా నీతి ఆయోగ్​ 5వ పాలక మండలి సమావేెశం శుక్రవారం జరిగింది. ప్రధాని నేతృత్వంలోని పాలక మండలితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్​మోహన్ రెడ్డి  సమావేశం వేదికగా ప్రత్యేక హోదా అంశంపై బలంగా వాదనలు వినిపించారు.

'2024 నాటికి రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం'
author img

By

Published : Jun 16, 2019, 5:31 AM IST

Updated : Jun 16, 2019, 10:34 AM IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండో సారి ఎన్నికయిన అనంతరం మొదటిసారి నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి 5వ సమావేశం వివిధ అంశాలపై చర్చకు వేదికైంది. కరవు, వ్యవసాయ రంగంలో సంస్కరణలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో 2024 నాటికి భారత్​ను ఐదు ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.75 ట్రిలియన్లని అంచనా. ఈ మొత్తాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు మోదీ. జిల్లా స్థాయి నుంచే జీడీపీ వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని దిశా నిర్దేశం చేశారు.

2022 నాటికి నవభారత నిర్మాణమే లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టనున్న సంస్కరణలపై ప్రధాని మోదీ సమావేశంలో వివరించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాల మెరుగుదల, మార్కెట్ మద్దతుకు ప్రోత్సాహమందించాల్సి ఉందన్నారు. ఆహార శుద్ధి రంగాన్ని వేగంగా అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు మోదీ. అన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమలుకై రాష్ట్రాలకు సూచన చేశారు.

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రుల గళం

ఒడిశాకు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశంలో లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రకృతి విపత్తులనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇటీవల ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపానుకు 14 జిల్లాలు ప్రభావితమయ్యాయని, రూ.9336 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నీతి ఆయోగ్​ సమావేశంలో కేంద్రాన్ని కోరారు.

నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు

నీతి ఆయోగ్ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు, పంజాబ్ సీఎం అమరీందర్​సింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ గైర్హాజరయ్యారు.

సమావేశం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ఆరోపిస్తూ బంగాల్ సీఎం మమత ముందస్తుగానే తన గైర్హాజరుపై ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైనందున కేసీఆర్ హాజరుకాలేకపోయారు. అనారోగ్య కారణాల వల్ల అమరీందర్ సింగ్, విదేశాల్లో ఉన్నందున జైరాం ఠాకూర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు.

ఇదీ చూడండి: మసాజ్​ సౌకర్యంపై వెనక్కి తగ్గిన రైల్వే శాఖ

రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

Tirupati (Andhra Pradesh), June 15 (ANI): Union Railway Minister Piyush Goyal reviewed facilities at the Tirupati railway station on Friday. Piyush Goyal inspected the station premises and reviewed the ongoing redevelopment work. He spoke to the Rail Land Development Authority (RLDA) officials and others concerned persons on developing the southern entrance and constructing a multi-storied complex on the main entrance side. He met the safai karmacharis and complimented them for maintaining the premises clean and hygienic. He also checked and expressed satisfaction at the food quality and standards.
Last Updated : Jun 16, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.