రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ ఓడిపోతే.. ప్రజాస్వామ్యం పరాజయం చెందిందని కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పును గౌరవించడం కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు.
పూర్తి మెజార్టీతో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిందని, ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటూ తమను ఎన్నుకున్నారన్నారు మోదీ. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ఈవీఎంలపై నిందలు మోపుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేవలం రెండు సీట్లే వచ్చినప్పుడు చాలా మంది నవ్వారని, కానీ కష్టపడి.. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుపొందామన్నారు. అంతేకాని పోలింగ్ కేంద్రాలపై నిందలు మోపలేదని ప్రధాని అన్నారు.