ETV Bharat / bharat

కశ్మీర్​లో భాజపా నేత హత్యపై ప్రధాని మోదీ ఆరా - వసీంబరి హత్యపై ప్రధాని ఆరా

కశ్మీర్​లో భాజపా నేత వసీంబరి కుటుంబం హత్యకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. వసీం ప్రాణత్యాగాన్ని వృథా కానియమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు.

killing of Wasim Bari
ప్రధాని మోదీ
author img

By

Published : Jul 9, 2020, 6:03 AM IST

జమ్ముకశ్మీర్​లో భాజపా నేత వసీంబరి కుటుంబంపై ఉగ్రదాడి, హత్య ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దాడికి సంబంధించి వివరాలను ఆరా తీసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. వసీంబరి కుటుంబానికి మోదీ సానుభూతి ప్రకటించినట్లు తెలిపింది.

పార్టీకి తీరని నష్టం..

వసీంబరి మృతి భాజపాకు తీరని నష్టమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వసీంబరి, ఆయన తండ్రి, సోదరుడి త్యాగాలను వృథా పోనియమని హామీ ఇచ్చారు.

"జమ్ముకశ్మీర్​లో జరిగిన క్రూరమైన దాడిలో వసీంబరి, అతని తండ్రి, సోదరుడిని కోల్పోయాం. పార్టీకి ఇది తీరని నష్టం. వసీం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన కుటుంబానికి భాజపా అండగా నిలుస్తుంది. వసీం త్యాగం వృథా కానివ్వం."

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

ఏం జరిగింది?

భారతీయ జనతా పార్టీ బందీపొరా జిల్లా మాజీ అధ్యక్షుడు వసీం బరీపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. బందీపొరా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని వసీం దుకాణం వద్దే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వసీం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన తండ్రి బషీర్​ అహ్మద్​, సోదరుడు ఉణర్​లు ఆస్పత్రికి తరలించే క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఇదీ చూడండి: భాజపా నేతపై ముష్కరుల దాడి- ముగ్గురి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.