దిల్లీలో రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశమైంది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అయిదవ, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న మొదటి పాలక మండలి భేటీ ఇది. ఈ సమావేశానికి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు లక్ష్యాలుగా ఈ సమావేశం జరుగుతోంది. వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా చర్చ జరుగుతోంది.
బంగాల్, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.