మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ స్మృతి భవన్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. జాతిపితకు నివాళులర్పించారు.
మహాత్మగాంధీ అందరికి ఆదర్శప్రాయుడని మోదీ అన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకున్నారు. ప్రధాని వెంట ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
అంతకు ముందు.. శనివారం ఉదయం గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించారు మోదీ.
ఇదీ చూడండి: 'రైతులకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ప్రభుత్వం'