ETV Bharat / bharat

భారత్​లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్​ షో

author img

By

Published : Feb 12, 2020, 3:25 PM IST

Updated : Mar 1, 2020, 2:26 AM IST

భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్​లో నిర్వహించే భారీ రోడ్​ షోలో పాల్గొననున్నారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన భారీ క్రికెట్ స్టేడియంను ప్రధాని మోదీతో కలిసి ప్రారంభించనున్నారు.

ahmedabad trump road show
భారత్​లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్​ షో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఫిబ్రవరి 24న భారత పర్యటనకు విచ్చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్​ ముందుగా అహ్మదాబాద్​లో నిర్వహించే భారీ రోడ్​ షోలో పాల్గొంటారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ఉన్న 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్​ షో సాగనుంది.

హౌడీ ట్రంప్

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ సందర్శిస్తారు. అనంతరం మోతెరాలో నూతనంగా నిర్మించిన సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్ స్టేడియంను మోదీతో కలిసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికిపైగా జనం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గతేడాది హ్యుస్టన్​లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం తరహాలోనే ఈ భారీ కార్యక్రమం ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్ అహ్మదాబాద్​లో పర్యటించడాన్ని అక్కడి స్థానికులు 'కెం చో ట్రంప్'(హౌడీ ట్రంప్)గా అభివర్ణిస్తున్నట్లు తెలిపారు.

మోతెరా స్టేడియం సామర్థ్యం దాదాపు 1.10 లక్షలు. ఇది ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్​బోర్న్​ స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ.

రోడ్​ షోకు ఏర్పాట్లు

రోడ్​ షోకు ఏర్పాట్ల కోసం అధికారులకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. స్టేడియంకు వచ్చే వారికి పార్కింగ్ సదుపాయం సహా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది.

ఇదివరకే పలువురు దేశాధినేతలు భారత పర్యటనలో భాగంగా గుజరాత్​ను సందర్శించారు. 2014-18 మధ్య కాలంలో భారత్​కు విచ్చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్, జపాన్ ప్రధాని షింజో అబె, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అహ్మదాబాద్​లో పర్యటించారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు.

Last Updated : Mar 1, 2020, 2:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.