ETV Bharat / bharat

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. తక్షణమే అమల్లోకి - గవర్నర్​ సిఫార్సుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం

మహారాష్ట్రలో అధికార పీఠం కోసం భాజపా-శివసేన మధ్య వైరంతో మొదలైన రాజకీయ ప్రతిష్టంభన రాష్ట్రపతి పాలనకు దారితీసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్​ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదముద్ర వేశారు. తక్షణమే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అయితే.. ఈ నిర్ణయంపైనా శివసేన... సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
author img

By

Published : Nov 12, 2019, 6:40 PM IST

Updated : Nov 13, 2019, 7:51 AM IST

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. తక్షణమే అమల్లోకి

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనలో సరికొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఇందుకు సంబంధించిన దస్త్రంపై కోవింద్​ ఆమోదముద్ర వేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్​... కేంద్రానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అంశాలను పరిశీలించానని.. అయినా రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నారు. వేరే ప్రత్యామ్నాయం లేనందున రాష్ట్రపతి పాలనే సరైన మార్గం అని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్​.. గవర్నర్​ సిఫార్సుకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్​ ప్రతిపాదన, గవర్నర్​ నివేదిక రాష్ట్రపతి భవన్​కు చేరాయి. కోవింద్​ సంతకంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

గవర్నర్​ నిర్ణయంపై మండిపడ్డ కాంగ్రెస్​...

మహారాష్ట్రలో గవర్నర్​... రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్​ తప్పుబట్టింది. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ నిర్ణయాన్ని ఖండించారు మహారాష్ట్ర కాంగ్రెస్​ ప్రతినిధి సచిన్​ సావంత్​. గవర్నర్​ ఎవరి ఒత్తిడితోనే పనిచేస్తున్నట్లు ఆరోపించారు.

సుప్రీంను ఆశ్రయిస్తాం...

ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం కూడగట్టుకునేందుకు మరింత గడువుకు నిరాకరించిన గవర్నర్​ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించింది శివసేన. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించింది.

రాష్ట్రపతి పాలన విధించడాన్ని కూడా సుప్రీంలో సవాల్​ చేస్తామని తెలిపింది సేన.

ఇదీ చూడండి: ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు: మోదీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kathmandu - 12 November 2019
1. Various of Bangladesh motorcade
2. President of Bangladesh Abdul Hamid arriving at Kathmandu International Airport
3. Nepal's President Bidya Devi Bhandari welcoming Hamid at airport with flowers
4. Bangladesh's first lady Rashida Hamid, left, posing with Abdul Hamid, center, and Bhandari, right
5. Hamid and Bhandari walking on red carpet
POOL - AP CLIENTS ONLY
Kathmandu - 12 November 2019
6. Various of Hamid and Bhandari walking on red carpet
7. Hamid being welcomed by women in red skirt with flowers
8. Various of Hamid and Bhandari at honor guard ceremony
9. Dance group performing
STORYLINE:
The President of Bangladesh Abdul Hamid arrived in Nepal on Tuesday starting his four-day visit.
Hamid was received by the President of Nepal Bidya Devi Bhandari at Kathmandu's international airport, where the two inspected the Nepalese honour guard.
Hamid is expected to meet officials and visit historical, archaeological and cultural sites during his trip to the Himalayan nation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 13, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.