ETV Bharat / bharat

ఆఫ్రికా దేశాల పర్యటనకు రాష్ట్రపతి పయనం​ - పర్యటన

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ బెనిన్​, గాంబియా, గినీ దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్న తొలి భారత రాష్ట్రపతి కోవింద్​.

ఆఫ్రికా దేశాల పర్యటనకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ పయనం​
author img

By

Published : Jul 28, 2019, 11:24 AM IST

భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆఫ్రికా దేశాల పర్యటనకు బయలుదేరారు. బెనిన్, గాంబియా, గినీ దేశాల్లో ఆయన ఏడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మూడు దేశాల్లో పర్యటిస్తున్న తొలి భారత రాష్ట్రపతి కోవింద్.

"రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇవాళ మధ్యాహ్నం బెనిన్​లోని కోటోనౌకు చేరుకుంటారు. రేపు ఆ దేశ అధ్యక్షుడు పాట్రిస్​ టాలోన్​తో భేటీ అవుతారు. అనంతరం పోర్టో నోవోలోని జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో కోవింద్​ భేటీ అవుతారు."- భారత విదేశాంగశాఖ

బుధవారం గాంబియా రాజధాని బంజుల్​కు చేరుకుంటారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు అడామా బారోతో చర్చలు జరుపుతారు. ఆగష్టు 1న గినీ రాజధాని కోనార్కి చేరుకుంటారు. మరుసటి రోజు ఆ దేశ రాష్ట్రపతితో రామ్​నాథ్​ కోవింద్ భేటీ కానున్నారు.

ఇదీ చూడండి: యడియూరప్ప​కు మద్దతు ఇచ్చేదిలేదు: దేవెగౌడ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.