2001 పార్లమెంట్‌పై ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా పలువురు నేతలు పార్లమెంటు ప్రాంగణంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు.
అమరుల త్యాగం
"2001లో భయంకరమైన ఉగ్రదాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించేందుకు ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆ మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలన్న సంకల్పానికి మేము కట్టుబడి ఉన్నాం."
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
కేంద్ర మంత్రులు, వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్లమెంటు దాడి అమరులకు నివాళులు అర్పించారు.
18 ఏళ్ల క్రితం..
2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేశారు. ముష్కరులను నిలువరించే ప్రయత్నంలో వీరోచితంగా పోరాడిన 9 మంది అమరులయ్యారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.
ఇదీ చూడండి: 'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'