అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సకుటుంబ సపరివార సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన రాక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడ చూసినా ట్రంప్ వార్తలే. ఆయన పర్యటించనున్న అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీలో భద్రత, స్వాగతం కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. ఈ నగరాల్లోని రోడ్లు, గోడలు, పరిసర ప్రాంతాలు, సందర్శనా స్థలాలకు కొత్త కళ సంతరించుకుంది. అంత సుందరంగా తయారయ్యాయి మరి.
తొలుత అహ్మదాబాద్, ఆగ్రా పర్యటన ముగిసిన అనంతరం 24న రాత్రి ట్రంప్ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? ఆయన ఉండే హోటల్ ఎక్కడ? దానికయ్యే ఖర్చు ఎంతో అందరికీ తెలుసుకోవాలనే ఉంటుంది కదా?
ఐటీసీ మౌర్య..
ట్రంప్ బస కోసం అత్యంత సురక్షితమైన, సుందరమైన ప్రదేశాన్ని ఎంపిక చేసింది భారత ప్రభుత్వం. 24న రాత్రి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ఉండనున్నారు డొనాల్డ్ ట్రంప్ దంపతులు. అదీ ప్రెసిడెన్షియల్ స్వీట్లో. ఇప్పుడు చాణక్య స్వీట్‌గా పిలిచే ఈ గది అద్దె ఒక్క రాత్రికి అక్షరాలా రూ.8 లక్షలు. అవును ఒక్క రాత్రికి అంత వెచ్చిస్తుంది భారత సర్కార్.
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించిన తర్వాత.. ట్రంప్ దంపతులు దిల్లీ చాణక్యపురిలో ఉన్న ఈ ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకుంటారు. గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌లోని చాణక్య స్వీట్లోనే సేదతీరుతారు.
ప్రత్యేకతలివే...
ఈ స్వీట్ 4,600 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇక్కడ ఒక్క రాత్రికయ్యే ఖర్చు రూ. 8 లక్షలు. ఇక్కడ హైస్పీడ్ లిఫ్ట్, అధ్యక్షుడు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక ప్రవేశ ద్వారం, స్వతంత్ర భద్రతా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో బిగించిన కిటికీలూ ఉంటాయి. ప్రెసిడెన్షియల్ ఫ్లోర్ అంటే ఆ మాత్రం సురక్షితంగా ఉండాలి కదా.
మినీ స్పా, జిమ్...
చాణక్య స్వీట్లో రెండు గదులుంటాయి. పడుకునేందుకు, ఇతర పనులకు ఒక పెద్ద గది, 12 మంది కూర్చుని తినేలా వీలుండే మరో పెద్ద భోజన గది ఉంటాయి. ఇందులో చిన్నపాటి స్పా ఏర్పాటు చేశారు. వ్యాయామం కోసం జిమ్ ఉండనే ఉంది.
-
With a breathtaking view of Delhi's green belt, Ottimo at West View, ITC Maurya, New Delhi offers a range of the most exquisite flavours from contemporary western cuisine.
— ITC Hotels (@ITCHotels) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
For reservations, call 011 - 66325152 pic.twitter.com/EtJVA3siqh
">With a breathtaking view of Delhi's green belt, Ottimo at West View, ITC Maurya, New Delhi offers a range of the most exquisite flavours from contemporary western cuisine.
— ITC Hotels (@ITCHotels) January 12, 2020
For reservations, call 011 - 66325152 pic.twitter.com/EtJVA3siqhWith a breathtaking view of Delhi's green belt, Ottimo at West View, ITC Maurya, New Delhi offers a range of the most exquisite flavours from contemporary western cuisine.
— ITC Hotels (@ITCHotels) January 12, 2020
For reservations, call 011 - 66325152 pic.twitter.com/EtJVA3siqh
ప్రెసిడెన్షియల్ స్వీట్లో వ్యక్తిగత పనుల కోసం బిజినెస్ కోర్ట్‌యార్డ్, సమ్మిట్ లాంజ్, ప్రైవేట్ బోర్డ్‌రూమ్ ప్రత్యేకంగా ఉన్నాయి.
మెహతా పెయింటింగ్స్..
భారత సంప్రదాయం ఉట్టిపడేలా ప్రఖ్యాత భారత చిత్రకారుడు తైయబ్ మెహతా పెయింటింగ్స్‌ను ఇక్కడి గోడలపై తీర్చిదిద్దారు. చాణక్యుడి అర్థశాస్త్రాన్ని వివరించే పలు చిత్రపటాలు కనిపిస్తాయి. భోజన గదిలోని టేబుల్‌పై ప్లేట్లు, క్రిస్టల్ డి పారిస్ గ్లాసులు వంటి విలాస వస్తువులు ఉంటాయి.
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ కింగ్ అబ్దుల్లా, బ్రూనై సుల్తాన్లు గతంలో భారత్ సందర్శించిన సమయంలో ఇక్కడే బస చేశారు.
వంటకాల్లోనూ ప్రత్యేకమే..
డొనాల్డ్ ట్రంప్‌ను తమ వంటకాలతో మైమరిపించేందుకు ఐటీసీ మౌర్య హోటల్లోని 'రెస్టారెంట్ బుఖారా' సన్నద్ధమైంది. అధ్యక్షుని కోసం పసందైన రుచులను సిద్ధం చేస్తోంది. ఈ బుఖారా రెస్టారెంట్ ఎందరో ప్రముఖులకు ఆతిథ్యమిచ్చింది.
అయితే.. 'ట్రంప్ తాలీ' కోసం ఎలాంటి వంటకాలు సిద్ధం చేశారో వివరాల్ని వెల్లడించలేదీ రెస్టారెంట్. బుఖారా వంటకాల్లో మాత్రం ప్రధానంగా తందూరీ, కబాబ్స్, దాల్ బుఖారా, ఖాస్తా రోటీ, భార్వాన్కుల్చా ఉంటాయి. ట్రంప్ దంపతులకు వడ్డించే జాబితాలో ఇవీ ఉండే అవకాశముంది.
ఇదీ చూడండి: ట్రంప్‌కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్
అధ్యక్షుడి భద్రతను ఏడాది పొడవునా క్షుణ్నంగా పరిశీలించే 24X7 సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఇప్పటికే ఈ ఐటీసీ హోటల్‌ను జల్లెడ పట్టింది. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత నిఘా పెట్టింది.