పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించటాన్ని 'దురదృష్టకరమైన సంఘటన'గా భాజపా అభివర్ణించింది. "కాంగ్రెస్ దురహంకార చర్యలు పెద్ద సమస్యగా మారుతున్నాయి" అని విమర్శించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. భాజపా ఎప్పుడూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించలేదని గుర్తుచేశారు. దిల్లీ హింసను కాంగ్రెస్ ఖండించకుండా జాతీయ పతాకాన్ని అవమానించిందన్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు నినాదాలు చేయటాన్ని తప్పుబట్టారు రవిశంకర్.
'అందుకే బహిష్కరించాం'
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినంత మాత్రాన ఆయన్ను అవమానించినట్లు కాదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ స్పష్టం చేశారు. తాము రైతుల పక్షాల నిలబడ్డామని అన్నారు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేయలేదు కాబట్టే సభను బహిష్కరించామని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో దీనిపై చర్చిస్తామన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!