ETV Bharat / bharat

980 గ్రాములున్న నవజాత శిశువుకు కరోనా - Premature newborn baby faught corona

కరోనా మహమ్మారి.. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 980 గ్రాములున్న ఓ నవజాత శిశువుకు కరోనా సోకింది. ప్రస్తుతం చిన్నారుల కేర్​ సెంటర్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Premature newborn baby
980 గ్రాములున్న నవజాత శిశువుకు కరోనా
author img

By

Published : Sep 18, 2020, 7:18 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. నవజాత శిశువుల నుంచి వృద్ధుల వరకు కరోనాపై పోరాడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 980 గ్రాములున్న ఓ నవజాత శిశువుకు కరోనా సోకింది. ప్రస్తుతం మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఆగస్టు 13న పురిటినొప్పులతో నగరంలోని వాణీవిలాస ఆసుపత్రిలో చేరింది ఓ గర్భిణి. అనంతరం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును ఐదురోజుల పాటు చిన్నారుల ప్రత్యేక వార్డులో ఉంచారు. కరోనా పరీక్షల్లో వైరస్​ సోకినట్లు తేలిన క్రమంలో విక్టోరియా యాక్సిడెంట్​ కేర్​ కేంద్రానికి తరలించారు వైద్యులు.

ఆ చిన్నారికి తీవ్ర ఆరోగ్య సమస్యలతో కరోనా నుంచి కోలుకోవటం సవాలుగా మారిందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం కోలుకుంటోందని చెప్పారు.

ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.