రుతుపవనాల రాకకు ముందు దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం తగ్గిందని 'భారత వాతావరణ సంస్థ(ఐఎండీ)' తెలిపింది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో ఏప్రిల్ నాటికి 27 శాతంగా ఉన్న లోటు వర్షపాతం మే నెలకు 22 శాతానికి తగ్గిందని తెలిపింది. సాధారణంగా ఈ కాలంలో 96.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏడాది కేవలం 75.9 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని స్పష్టం చేసింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి ఈ లోటు వర్షపాతం తక్కువగా ఉండడం ఎంతో అవసరం.
దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా 46 శాతం, ఆ తర్వాత ఉత్తర భారత రాష్ట్రాల్లో 36 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్, బిహార్, పశ్చిమ బంగాల్, ఒడిశాల్లో 7 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
మధ్య భారత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, చత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఎలాంటి లోటు వర్షపాతం నమోదవ్వలేదని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాఠోడ్ తెలిపారు.
ఇదీ చూడండి : సర్వత్రా ఉత్కంఠ.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!