ETV Bharat / bharat

2020లో ప్రసార భారతి 'డిజిటల్​' హిట్​

author img

By

Published : Jan 4, 2021, 3:07 AM IST

ప్రసార భారతిలోని డిజిటల్​ ఛానెళ్లు 2020లో దుమ్మురేపాయి. 100శాతానికిపైగా వృద్ధి సాధించి.. బిలియన్​ డిజిటల్​ వ్యూస్​ను సంపాదించుకున్నాయి. అయితే దూరదర్శన్​, ఏఐఆర్​ సేవలను అధికంగా ఉపయోగించుకున్న రెండో దేశం పాకిస్థాన్​ కావడం గమనార్హం.

Prasar Bharati's digital channels record 100% digital growth in 2020; Pak second highest audience
2020లో ప్రసార భారతి 'డిజిటల్​' హిట్​

2020లో ప్రసార భారతికి చెందిన డిజిటల్​ ఛానెళ్లు.. 100శాతానికిపైగా వృద్ధిని సాధించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దూరదర్శన్​, ఏఐఆర్​(ఆల్​ ఇండియా రేడియో) సేవలను అధికంగా ఉపయోగించుకున్న రెండో దేశంగా పాకిస్థాన్​ నిలిచిందని పేర్కొంది.

గతేడాదిలో.. దూరదర్శన్​, ఆకాశవాణి ఛానెళ్లు.. బిలియన్​ డిజిటల్​ వ్యూస్​, 6 బిలియన్​ డిజిటల్​ వాచ్​ మినిట్స్​ను సంపాదించుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సేవలను అధికంగా ఉపయోగించుకున్న మొదటి దేశం భారత్​ కాగా.. రెండు, మూడు స్థానాల్లో పాకిస్థాన్​, అమెరికాలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

ప్రసార భారతి మొబైల్​ యాప్​ "న్యూస్​ ఆన్​ ఎయిర్​"కు 2020లో 2.5 మిలియన్​ మంది యూజర్స్​ పెరిగారు. మొత్తం మీద 300 మిలియన్​ వ్యూస్​ సంపాదించుకుంది ఈ యాప్​.

ఈ వీడియోలకు క్రేజ్​..

పాఠశాల విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ, 2020 గణతంత్ర్య దినోత్సవ పరేడ్​, డీడీ నేషనల్​లోని గణిశాస్త్ర దిగ్గజం శకుంతలా దేవీ అరుదైన వీడియోలు అత్యధిక జనాదరణ పొందాయి.

ఇదీ చూడండి:- దిల్లీ నిరసనల్లో మరో ముగ్గురు రైతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.