ETV Bharat / bharat

ఆమ్ ​ఆద్మీ తరఫున ప్రకాశ్​ రాజ్​ ప్రచారం - ప్రచారం

ఆమ్ ​ఆద్మీ పార్టీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ ప్రకటించారు. పార్టీలో చేరకపోయినా ఆప్​ సిద్ధాంతాలు మాత్రం తనకు బాగా నచ్చాయని తెలిపారు. దిల్లీలో వారం రోజుల పాటు ఆప్​ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆమ్ ​ఆద్మీ తరఫున ప్రకాశ్​ రాజ్​ ప్రచారం
author img

By

Published : May 5, 2019, 6:50 AM IST

Updated : May 5, 2019, 8:38 AM IST

ఆమ్ ​ఆద్మీ తరఫున ప్రకాశ్​ రాజ్​ ప్రచారం

బెంగళూరు సెంట్రల్‌నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు ప్రకాశ్​ రాజ్‌ ఆమ్‌ఆద్మీ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దిల్లీలో వారం రోజుల పాటు ఆప్‌ తరఫున ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మతపరమైన, ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికేందుకు.. ప్రజలందరూ తమతో కలిసి రావాలని ప్రకాశ్​ రాజ్‌ పిలుపునిచ్చారు.

ఆప్‌లో తాను లేకపోయినా ఆ పార్టీ సిద్ధాంతాలు మాత్రం తనకు బాగా నచ్చాయన్నారు. దేశంలో ఏ పార్టీ అయినా పాలించడానికి కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇతర పార్టీలతో పోలిస్తే ఆప్‌ మార్పు కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని అందుకే ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.

ఈ పార్టీ (ఆమ్​ ఆద్మీ) నాకు చాలా నచ్చింది. సామాన్యులకు మెరుగైన ఆరోగ్యం, విద్య అందించేందుకు ఆప్​ ఎన్నికల్లో పోరాడుతోంది. పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చాయి. దిల్లీలో, దేశంలో మార్పు కోసం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ప్రస్తుతం మతపరమైన, ద్వేషపూరిత రాజకీయాలు, ప్రసంగాలు నడుస్తున్నాయి. వీరి మధ్య ఆప్​ లాంటి పార్టీ ఒక మంచి వినసొంపైన పాటలాంటిది. ఈ దేశ పౌరుడిగా ఇలాంటి వారికి మద్దతు పలకడం నా బాధ్యత.
- ప్రకాశ్​ రాజ్​, సినీ నటుడు

Mumbai, May 04 (ANI): Mumbai Indians (MI) has qualified for play offs of IPL 2019. MI is currently at 2nd spot with 8 wins. While talking to media at pre match press conference, MI bowler Rahul Chahar said, "When I was a kid, I would follow (Shane) Warne. Now, it's Imran Tahir (CSK). He brings in variation and no matter how the wicket or the conditions are, he generates turn. I love to watch Imran Tahir, he knows how to bowl in every condition." MI will play next match against KKR on May 05 in Mumbai's Wankhede Stadium.
Last Updated : May 5, 2019, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.