విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనలో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్ తాజా పరిస్థితులు సహా ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
గత వారం సర్వసభ్య సమావేశంలో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి అంశంపై ఇరు దేశాలు చర్చించాయి. అప్పటి నిర్ణయాల అమలుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ భేటీ ఉపయోగపడిందని విదేశాంగ శాఖ పేర్కొంది.
కశ్మీర్ అంశం
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన అనంతరం కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి గల కారణాలను పాంపియోకు జైశంకర్ వివరించారు. ఆర్టికల్ రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని ఎన్నో ఏళ్ల నుంచి ఈ అంశంపై కసరత్తు చేశామని జైశంకర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : క్షణాల్లో పబ్లిక్ టాయిలెట్స్ జాడ గూగుల్ మ్యాప్స్‌లో..!