ETV Bharat / bharat

'2019తో పోలిస్తే మరింత తీవ్రంగా దిల్లీ కాలుష్యం' - బాణసంచా నిషేధం ఉల్లంఘన

ఈ ఏడాది దీపావళికి దిల్లీ కాలుష్యం తీవ్రంగా పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీపావళి తర్వాత రోజు నమోదయ్యే వాయు కాలుష్యం పరంగా చూస్తే.. నాలుగేళ్లలో ఈ ఏడాది అత్యధికంగా నమోదైంది.

CPCB_Delhi pollution
'గతేడాది కంటే ఈ ఏడాది మరింతగా దిల్లీ కాలుష్యం'
author img

By

Published : Nov 16, 2020, 7:40 AM IST

గతేడాది కంటే ఈ ఏడాది దీపావళికి.. దిల్లీ కాలుష్యం మరింత పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల వల్ల, చుట్టు పక్కల రాష్ట్రాల్లో.. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరినట్లు పేర్కొంది.

ఈ మేరకు. .కాలుష్య వివరాలకు సంబంధించి ఓ నివేదికని సమర్పించింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. గతేడాది వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల 19 శాతం కాలుష్యం నమోదైందని తెలిపింది. ఈ ఏడాది అది 32 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

"ఈ ఏడాది దీపావళి పండగ నవంబర్​ మధ్యకాలంలో రావడం వల్ల వాతావరణ మార్పు ప్రభావం కాలుష్యంపై మరింతగా ఉంది. గతేడాది .. అక్టోబర్​ చివరి వారంలో పండగ జరగడం వల్ల ఈ తీవ్రత కాస్త స్వల్పంగా ఉంది" అని నివేదికలో పేర్కొంది సీపీసీబీ.

గత నాలుగేళ్లలో ఈరోజే తీవ్రంగా!...

దీపావళి పండగ తర్వాత రోజు వాయు కాలుష్యం నమోదు శాతం పరిశీలిస్తే.. ఈ ఏడాది కాలుష్యం మరింత పెరిగింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

ఒకే రోజు 2000 కాల్స్..

నవంబర్​ 30 వరకు దిల్లీలో బాణసంచా వినియోగాన్ని నిషేధించింది హరిత ట్రైబ్యునల్. కానీ, పండగ రోజు.. తమ ప్రాంతంలో పటాకులు కాల్చుతున్నారంటూ దిల్లీ పోలీసులకు దాదాపు 2000 ఫోన్​ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ సీనియర్​ పోలీసు అధికారి వెల్లడించారు.

దీపావళి రోజు 850 మందిని అరెస్టు చేశామని, 1314.42 కిలోల బాణసంచాను సీజ్​ చేశామని ఓ​ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ముంబయిలో టపాసుల మోత 'మోగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.