తమిళనాడు కడలూరు పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో రెండు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య మొదలైన గొడవ.. హింసాత్మకంగా మారింది.
ఓడిపోయిన ఆవేశంలో..!
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి అమ్సయజ్పై.. రాజేశ్వరి అనే మహిళ గెలుపొందారు. ఓడిపోయిన అమ్సయజ్ అనుచరులు.. ఆగ్రహంతో మంగళవారం రాజేశ్వరి నివాసంలోకి చొరబడి, రాళ్లు, కర్రలతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాజేశ్వరి మద్దతుదారులు ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో మొదలైన గొడవ.. చూస్తుండగానే హింసాకాండగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలను అదుపుచేశారు. గ్రామంలో సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.