ETV Bharat / bharat

లాక్​డౌన్​ పాస్​ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత - పంజాబ్ పాటియాలా​లో పోలీసులపై నిహాంగ్ బృందం దాడికి

పంజాబ్ పటియాలా​లో పోలీసులపై నిహాంగీలు దాడికి పాల్పడ్డారు. ఏఎస్ఐ చేతిని నరికేశారు. గాయపడ్డ పోలీసులను సహచరులు ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పంజాబ్ డీజీపీ దిన్​కర్ గుప్తా స్పష్టం చేశారు.

policemans-hand-chopped-off
పోలీస్ చెయ్యిని కత్తితో నరికిన దుండగులు
author img

By

Published : Apr 12, 2020, 11:32 AM IST

పంజాబ్​లో దారుణం జరిగింది. పటియాలాలోని సబ్జీ మండీ ప్రాంతంలో పోలీసులపై నిహాంగ్​లు(సంప్రదాయ ఆయుధాలు ధరించే సిక్కులు) దాడి చేశారు. కొందరు దుండగులు ఏఎస్​ఐ హర్జీత్ సింగ్ చెయ్యి నరికేసినట్లు పోలీసులు తెలిపారు. మండీ బోర్డ్​కు చెందిన పలువురు పోలీసులు సైతం గాయపడ్డట్లు వెల్లడించారు.

ఉదయం 6.15 గంటల సమయంలో ఓ వాహనంలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డట్లు పటియాలా పోలీస్ అధికారి మన్​దీప్ సింగ్ సిద్ధు తెలిపారు. కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు ఆపినప్పుడు దాడి చేసినట్లు వివరించారు.

"వారిని కర్ఫ్యూ పాస్​లు చూపించాలని అడిగాం. కానీ వారు ఆగకుండా అడ్డుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్​పెక్టర్ చెయ్యిని కత్తితో నరికారు. సర్దార్ పటియాలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైతం ఈ దాడిలో గాయపడ్డాడు."-మన్​దీప్ సింగ్ సిద్ధు, పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్​ పోలీస్

అనంతరం నిహాంగీలు అక్కడి నుంచి పారిపోయినట్లు మన్​దీప్ తెలిపారు. వారిని అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడ్డ హర్జీత్ సింగ్​ను తొలుత స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చండీగఢ్​లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ దిన్​కర్ గుప్తా స్పందించారు. తీవ్ర గాయాలపాలైన హర్జీత్ సింగ్​కు వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు స్పష్టం చేశారు. నిందితులను సత్వరమే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.