ETV Bharat / bharat

నాటు బాంబు దాడి- పోలీసు, నిందితుడు మృతి - Policeman killed in crude bomb attack in Thoothukudi while effecting arrest

తమిళనాడు తూత్తుకుడిలో నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుతో పాటు.. బాంబు విసిరిన ప్రధాన నిందితుడు మరణించాడు.

Policeman killed in crude bomb attack in Thoothukudi while effecting arrest
నాటు బాంబు దాడి- పోలీసు, నిందితుడు మృతి
author img

By

Published : Aug 18, 2020, 5:21 PM IST

తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన బాంబు దాడిలో ఓ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి మరణించారు. హత్య కేసు నిందితులను అరెస్టు చేసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాణాలు కోల్పోయిన పోలీసు పేరు సుబ్రహ్మణియన్​గా పేర్కొన్నారు అధికారులు. జంట హత్యల కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో ఆయన సభ్యుడని తెలిపారు.

నాటు బాంబు దాడి- పోలీసు, నిందితుడు మృతి

ఇదీ జరిగింది

హత్య కేసులో లభించిన ఆధారాలతో నిందితులు తలదాచుకున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిందితుడు దురై ముత్తుతో పాటు ఇతర అనుమానితులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే నిందితులకు పోలీసులకు మధ్య స్వల్పంగా మొదలైన ఘర్షణ.. క్రమంగా తీవ్రమైంది. దురై ముత్తు పోలీసులపై నాటు బాంబు విసిరాడు.

సుబ్రహ్మణియన్​తో పాటు.. బాంబు విసిరిన దురై ముత్తు సైతం తీవ్ర గాయాలతో మరణించినట్లు అధికారులు తెలిపారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో ఘర్షణ పడ్డ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి- 'ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల్లో కొత్త రూల్స్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.