ETV Bharat / bharat

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. కట్టుకథేనా? - కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగింది. రాత్రంతా దారుణానికి పాల్పడి తెల్లవారుజామున రోడ్డుపై వదిలేశారు. ఇది రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా కలకలం రేపిన వార్త. అయితే.. పోలీసుల విచారణలో మరో విధంగా తేలింది. ఆమె చప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని తేల్చారు.

molestation
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం
author img

By

Published : Sep 28, 2020, 8:46 PM IST

'ఉత్తర్​ప్రదేశ్​లో కదులుతున్న బస్సులో ఓ మహిళపై రాత్రంతా పలుమార్లు అత్యాచారం చేసి, తెల్లవారుజామున బస్సులోంచి తోసేశారు. మేరఠ్​ జిల్లా సర్ధనాకు చెందిన మహిళ.. శుక్రవారం రాత్రి దిల్లీ వెళ్లేందుకు బైసాలి బస్టాప్​లో బస్సు ఎక్కింది. కొద్దిసేపటికి బస్సులోని అందరూ దిగిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపిన డ్రైవర్​, కండక్టర్​ మత్తుమందు కలిపిన కూల్​డ్రింక్​ ఇచ్చారు. స్ఫృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బస్సులోంచి రోడ్డుపై తోసేసి వెళ్లారు. తీవ్ర గాయాలైన మహిళను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.' అని వచ్చిన వార్తలు యూపీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇదంతా ఆ మహిళ అల్లిన కట్టుకథ అని తేలింది.

మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు, సదరు మహిళ మొబైల్​ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మహిళ భర్తను ప్రశ్నించారు. వారి దర్యాప్తులో అన్ని అబద్ధాలేనని తేలింది.

దర్యాప్తు ప్రకారం.. 35 ఏళ్ల ఆ మహిళకు 8 ఏళ్ల వయసున్న బిడ్డ ఉంది. మద్యానికి బానిసైన ఆమె మూడేళ్ల క్రితం తన భర్తను వదిలేసింది. కొద్ది రోజులు సరూర్​పుర్​లో ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. అనంతరం అతన్ని వదిలేసి తన తమ్ముడి వద్దకు చేరింది. ఎవరికి చెప్పకుండా పలు సందర్భాల్లో ఇంటిలోంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కాల్​ డేటా ప్రకారం సైన్యం నుంచి సస్పెండ్​ అయిన ఓ మాజీ సైనికుడికి ఫోన్​ చేసినట్లు తెలిసింది. అతను, అతని సన్నిహితుడితో కలిసి సదరు మహిళ మద్యం సేవించింది. ముగ్గురి మధ్య అంగీకారంతోనే శారీరకంగా కలిశారు. ఆ తర్వాతి రోజున సదరు మహిళను మద్యం మత్తులోనే దిల్లీలోని రోడ్డుపై వదిలి వెళ్లారు.

ప్రస్తుతం మాజీ సైనికుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ముందు రోజు జరిగిన విషయాలన్నీ అతను వెల్లడించాడు. అతని సన్నిహితుని కోసం వెతుకుతున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: 'పోలీసు రాజ్యంగా మార్చారు- నేనే రంగంలోకి దిగుతా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.