ETV Bharat / bharat

భాజపా నేత గోదాములో ఆయుధాలు స్వాధీనం

మధ్యప్రదేశ్​ భాజపా నేత సంజయ్ యాదవ్​ మద్యం గోదాములో అక్రమంగా దాచిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. 13 పిస్తోళ్లు, గ్రనేడ్లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

భాజపా నేత గోదాంలో ఆయుధాలు స్వాధీనం
author img

By

Published : Apr 2, 2019, 8:38 AM IST

Updated : Apr 2, 2019, 9:34 AM IST

భాజపా నేత గోదాంలో ఆయుధాలు స్వాధీనం

మధ్యప్రదేశ్​ బర్వానీ సెంద్వా ప్రాంతానికి చెందిన ఓ భాజపా నేత మద్యం​ గోదాములో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

భాజపా నేత సంజయ్​ యాదవ్​ లిక్కర్​ గోదాంలో అక్రమ ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఎస్పీ యంగ్చాన్​ ధోల్కర్​ భూటియా ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 13 పిస్తోళ్లు, 111 లైవ్​ కాట్రిడ్జులు, 17 గ్రనేడ్​లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంజయ్ యాదవ్​, అతని సోదరుడు జితు యాదవ్​లపై పోలీసులు ఆయుధ చట్టం, పేలుడు పదార్ధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. సంజయ్​ తల్లి సెంద్వా మున్సిపల్​ అధ్యక్షురాలుగా ఉన్నారు. సోదాల సమయంలో ఆమె అక్కడే ఉన్నారు.

సంజయ్​ యాదవ్​పై ఇప్పటికే పలు క్రిమినల్​ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసుపై ఎన్​ఎస్​ఏ విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి:"అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు"

Intro:Body:Conclusion:
Last Updated : Apr 2, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.