నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పరిమాణం ఘనంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికంగా వెచ్చించారు. ఈ సారి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో పద్దును ప్రవేశపెట్టారు.
-
Take a look at #Budget2019 estimates - receipts, expenditure and deficits#BudgetForNewIndia pic.twitter.com/QH1H6ADElT
— PIB India (@PIB_India) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Take a look at #Budget2019 estimates - receipts, expenditure and deficits#BudgetForNewIndia pic.twitter.com/QH1H6ADElT
— PIB India (@PIB_India) July 5, 2019Take a look at #Budget2019 estimates - receipts, expenditure and deficits#BudgetForNewIndia pic.twitter.com/QH1H6ADElT
— PIB India (@PIB_India) July 5, 2019
ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 19 లక్షల 62 వేల 761 కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. మూలధన రాబడులు 8 లక్షల 23 వేల 588 కోట్లుగా అంచనా వేశారు.
ద్రవ్యలోటు 7 లక్షల 3 వేల 760 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి... ఇది జీడీపీలో 3.3 శాతంగా ఉంటుందన్నారు.
రెవెన్యూ రాబడుల్లో అత్యధికంగా ప్రతి రూపాయిలో 21 పైసలు కార్పొరేషన్ పన్ను రూపంలో, రుణాలు, ఇతర మార్గాల్లో 20 పైసలు, జీఎస్టీ ద్వారా 19, ఆదాయపన్నుతో 16 పైసలు వస్తాయని అంచనా వేశారు.
-
All in a rupee - a break-up of estimated government receipts and expenditure, as per #Budget2019 #BudgetForNewIndia pic.twitter.com/eymwOW04oH
— PIB India (@PIB_India) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All in a rupee - a break-up of estimated government receipts and expenditure, as per #Budget2019 #BudgetForNewIndia pic.twitter.com/eymwOW04oH
— PIB India (@PIB_India) July 5, 2019All in a rupee - a break-up of estimated government receipts and expenditure, as per #Budget2019 #BudgetForNewIndia pic.twitter.com/eymwOW04oH
— PIB India (@PIB_India) July 5, 2019
రూపాయి వచ్చే మార్గాలు(పైసల్లో)..
- కార్పొరేట్ పన్ను- 21
- అప్పులు- 20
- జీఎస్టీ- 19
- ఆదాయపన్ను- 16
- పన్నేతర రాబడి- 09
- ఎక్సైజ్ సుంకాలు- 08
- కస్టమ్స్ సుంకం- 04
- రుణేతర మూలధన రాబడి- 03
రెవెన్యూ వ్యయానికి సంబంధించి పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద 23 పైసలు ఇస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. వడ్డీల చెల్లింపు కోసం 18 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 13, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రక్షణకు 9 పైసలు చొప్పున కేటాయించారు.
రాయితీలు, ఇతర ఖర్చుల కోసం 8 పైసలు చొప్పున.. ఆర్థిక సంఘం, ఇతర నిధుల బదిలీల కోసం 7 పైసలు, పెన్షన్ల కోసం 5 పైసలు వెళ్తాయని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.
వివిధ రంగాలకు కేటాయింపులు...
రక్షణ రంగానికి..
రక్షణ శాఖకు ఈసారి పెద్దగా కేటాయింపులు పెంచలేదు. రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ను ఈ సారి రూ. 3.18 లక్షల కోట్లు చేశారు.
వ్యవసాయ రంగానికి..
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు జరిపింది కేంద్రం. ఈ సారి రూ. 1.39 లక్షల కోట్లను ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కిసాన్ సమ్మాన్ నిధికి రూ. 75 వేల కోట్లను కేటాయించారు.
హోం శాఖకు..
కేంద్ర హోంశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్తో పోలిస్తే.. 5.17 శాతం నిధులు పెంచి.. రూ. 1, 19, 025 కోట్లు కేటాయించారు.
వైద్య, ఆరోగ్య శాఖ భారీగా...
గత రెండు బడ్జెట్లతో పోలిస్తే ఈ సారి వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించింది. ఈ సారి రూ. 62 వేల 659 కోట్ల 12 లక్షలు ప్రతిపాదించింది.
ఇందులో భాగంగా ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 6 వేల 400 కోట్లు ఖర్చు చేయనున్నారు.
విద్యాశాఖకు 13 శాతం అధికం...
విద్యాశాఖకు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికంగా బడ్జెట్ ప్రతిపాదించారు. ఈ సారి రూ. 94 వేల 853 కోట్ల 64 లక్షలు కేటాయించారు. ఇందులో స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 400 కోట్లను కేటాయించారు.
48.2 శాతం పెరిగిన బొగ్గు శాఖ బడ్జెట్..
గతేడాది బొగ్గు శాఖకు రూ. 781.85 కోట్లు కేటాయించిన కేంద్రం... ఈ సారి ఆ మొత్తాన్ని దాదాపు సగానికి పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1159.05 కోట్లు కేటాయించింది.
వివిధ కేటాయింపులు...
- ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ. 3.01 లక్షల కోట్లు కేటాయింపు
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 29 వేల కోట్లు
- సిబ్బంది మంత్రిత్వ శాఖకు రూ. 235 కోట్లు
- పర్యాటకానికి రూ. 2,189 కోట్లు
- జలశక్తి శాఖకు రూ. 28 వేల 261 కోట్లు కేటాయింపు