ETV Bharat / bharat

'ట్రాక్టర్​ ర్యాలీ'తో రైతు ఉద్యమానికి బీటలు!

ట్రాక్టర్​ ర్యాలీ నిరసనలతో దద్దరిల్లిన దిల్లీలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హింసాకాండకు సంబంధించి పోలీసులు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. మంగళవారం జరిగిన బీభత్సానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. దిల్లీలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్ష నిర్వహించారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకున్నాయి.

police files 22 firs' and 2 unions quit farmers' protest, a day after Delhi violence
రైతు ఉద్యమంలో 'ట్రాక్టర్​ ర్యాలీ' బీటలు
author img

By

Published : Jan 27, 2021, 7:41 PM IST

దిల్లీ ట్రాక్టర్​ ర్యాలీ హింసాకాండ జరిగిన ఒక రోజు అనంతరం దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓవైపు ఘర్షణలకు సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయగా.. మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇన్ని రోజులు ఐకమత్యంతో శాంతియుతంగా నిరసనలు చేపట్టిన రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఇప్పటికే రెండు రైతు సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి.

22 ఎఫ్​ఐఆర్​లు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్​లో హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. వీటిల్లో రాకేశ్​ టికాయత్, మేధా పాఠక్​, బుటా సింగ్​, యోగేంద్ర యాదవ్​తో పాటు మొత్తం మీద 37మంది రైతు నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

police files 22 firs' and 2 unions quit farmers' protest, a day after Delhi violence
ఘర్షణల సమయంలో

ఇదీ చూడండి:- పెళ్లి వేడుక కోసం వచ్చి.. హింసకు ఆ 'రైతు' బలి

ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని అరెస్ట్​ చేసి.. వారినీ ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

పోలీసు నుంచి టియర్​ గ్యాస్​ తుపాకీని లాక్కున్న రైతు

దిల్లీ హింసతో సంబంధం ఉన్న 550 ఖాతాలను సస్పెండ్​ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ బుధవారం ప్రకటించింది. తమ పాలసీని ఉల్లంఘించిన ట్వీట్లను లేబుల్​ చేసినట్టు పేర్కొంది.

గణతంత్ర పరేడ్​లో అలజడులపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హింసకు కారణమైన వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్​ ఏర్పాటు చేయాలని పిటిషనర్​ కోరారు.

అల్లర్లలో ఎర్రకోట వద్ద విధ్వంసం

షా సమీక్ష..

హింసాత్మక ఘటనలపై బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్ష నిర్వహించారు. షా నివాసంలో జరిగిన భేటీకి ఉన్నతాధికారులు హాజరై.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించారు. ఘర్షణలపై ఒక రోజు వ్యవధిలో షా సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.

ఈ నేపథ్యంలో దిల్లీలో అదనపు బలగాల కేటాయింపుతో పాటు.. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం.

రైతు సంఘాల్లో చీలిక!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మక ఘటనలు.. 58రోజులుగా శాంతియుతంగా సాగిస్తున్న రైతుల పోరాటంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఘర్షణల అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు రెండు( భారతీయ కిసాన్​ యూనియన్(భాను)​, రాష్ట్రీయ కిసాన్​ మజ్దూర్​ సంఘటన్​) సంఘాలు ప్రకటించాయి.

ఇదీ చూడండి:- 'ఇకనైనా సాగు చట్టాలను వెనక్కి తీసుకోండి'

ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం.. వేరేలా ఉందని, అలాంటప్పుడు ఉద్యమంలో కొనసాగలేమని ఆర్​కేఎంఎస్​ నాయకుడు వి.ఎం. సింగ్​ వ్యాఖ్యానించారు.

ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్​ యూనియన్​ తెలపిన కొద్ది సేపటికే.. చిల్లా సరిహద్దులోని అనేక మంది రైతులు.. తమ టెంట్లను తొలగించారు.

ఘాజీపుర్​ సరిహద్దు వద్ద పరిస్థితి

పాదయాత్ర వాయిదా!

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న పార్లమెంటు వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించిన రైతు సంఘాల నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ట్రాక్టర్​ ర్యాలీలో హింస దృష్ట్యా పాదయాత్ర వేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ నేత ఒకరు చెప్పారు.

దిల్లీ పరిస్థితి..

దేశ రాజధానిలో మంగళవారం ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో నిరసనలు బీభత్సం సృష్టించారు. నిర్దేశిత మార్గం, నిర్ణీత సమయం వంటి నిబంధనలు ఉల్లఘించి.. చెలరేగిపోయారు. ఎర్రకోటవైపు దూసుకెళ్లి ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. ఐటీఓ వద్ద పోలీసులు- రైతులకు మధ్య చెలరేగిన ఘర్షణలో 6 బస్సులు, 5 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. మొత్తం మీద 300కుపైగా మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుళ్లు

ఇంతటి విధ్వసంకర గణతంత్ర పరేడ్​ ముగిసి ఒక రోజు అయినప్పటికీ.. దిల్లీలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. రైతులు ఉన్న సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది ప్రభుత్వం. మరోవైపు ట్రాఫిక్​పైనా ఆంక్షలు విధించింది. లాల్​ ఖిలాలో మెట్రో స్టేషన్​ను మూసివేయగా.. పలు ప్రాంతాల్లో సేవలను నియంత్రించారు.

దిల్లీలో ట్రాఫిక్​ ఇక్కట్లు

ఇదీ చూడండి:- 'దిల్లీ హింసకు దీప్​ సిధు లాంటి విద్రోహ శక్తులే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.