ETV Bharat / bharat

మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రసంగానికి రికార్డ్​ వీక్షణలు - modi package speech high viewer ship

ఈ వారంలో దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేలా.. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ మోదీ చేసిన ప్రసంగం భారీ వీక్షణలు సొంతం చేసుకుంది. మే 12న ప్రసారమైన ఈ లైవ్​ను 193 మిలియన్ల మంది టీవీల్లో వీక్షించారని బ్రాడ్​ కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​ (బార్క్) తెలిపింది. ఇప్పటి వరకు మోదీ ప్రజలకు అందించిన సందేశాల్లో అత్యధిక నిమిషాల వీక్షణలు పొందిన ప్రసంగంగా గుర్తింపు పొందింది.

PM's stimulus package address garnered viewership of 193 mn: BARC
మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రసంగానికి 193 మిలియన్ల వీక్షణలు
author img

By

Published : May 15, 2020, 6:47 AM IST

కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదుతూ.. ఈ వారంలో రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ మోదీ చేసిన ప్రసంగం 193 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ప్రజలకు అందించిన సందేశాల్లో అత్యధిక నిమిషాల వీక్షణలు పొందిన ప్రసంగంగా ఇది నిలిచిందని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్ ​(బార్క్​) వెల్లడించింది.

మే 12న 33 నిమిషాల పాటు మాట్లాడారు మోదీ. గతంలో ప్రసంగించిన వీడియోను 203 మిలియన్ల మంది టీవీలో వీక్షించగా.. ఈ సారి ప్రేక్షకులు తగ్గారు. అయితే, నిమిషాల వ్యవధిలో చూస్తే.. అత్యధికంగా 4.3 బిలియన్ల నిమిషాల వీక్షణలతో తొలిస్థానంలో నిలిచింది. ఈ వారంలో మోదీ చేసిన ప్రసంగం 197 ఛానెల్లలో కనిపించగా.. గతంలో 199 ఛానెల్లలో ప్రసారమైంది.

టీవీ చూసే వారిలో క్రమంగా తగ్గుదల

లాక్​డౌన్​ ప్రారంభంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల తొలుత అధిక వీక్షణలు వచ్చాయని బార్క్​ పేర్కొంది. ఆ తర్వాత మే తొలి వారాంతం నాటికి టీవీ చూసే వారి సంఖ్య తగ్గినట్లు తెలిపింది. అయితే, వార్తలు, చలన చిత్రాలకు వీక్షకులు పెరిగారు.

వాణిజ్య ప్రకటనలపై లాక్​డౌన్​ ప్రభావం...

ప్రకటనలపైనా లాక్​డౌన్​ ప్రభావం పడింది. కిందటి వారం నుంచి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసే సమయం 9 శాతం తగ్గింది. లాక్​డౌన్​ సమయంలో వీక్షణలు లేకపోవడం వల్ల ఈ రంగానికి ప్రధాన ఆదాయ వనరులైన ప్రకటనలు కరవయ్యాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ వారంలో మొబైల్​, డేటా వినియోగంలో 14, 18 శాతం చొప్పున పెరిగినట్లు తెలిపింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.