ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమవేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో అసత్యాలు పలికారని.. కేంద్రం జమ్ముకశ్మీర్‌లో చేపడుతున్న చర్యలే ఇందుకు రుజువని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
ఐరాస 74వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన మోదీ.. ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోన్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కలిసిరావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
"ఐరాస సర్వసభ్య సమావేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రధాని మోదీ భారత్‌ను కీర్తించడం హాస్యాస్పదం. ఇందుకు జమ్ముకశ్మీర్‌లో విధించిన ఆంక్షలే నిదర్శనం."
-నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటన
మానవ హక్కులపై గౌరవం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొంది పార్టీ. దురదృష్టవశాత్తు రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ రద్దు చేసిన అనంతరం రాష్ట్ర ప్రజలు వారి పౌరహక్కులను పొందలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. అభివృద్ధి అనే నెపంతో రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ను.. కేంద్రపాలిత ప్రాంతం చేశారని ఆరోపించింది.
ఇదీ చూడండి:'భారతీయుల తరఫున మాట్లాడే అర్హత పాక్‌కు లేదు'