ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోమారు తన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనపై దేశానికి మోదీ అబద్ధం చెప్పారని ఆరోపించారు. ప్రధాని పిరికితనమే.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకునేలా చేసిందని మండిపడ్డారు.
-
Everybody believes in the capability and valour of the Indian army.
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Except the PM:
Whose cowardice allowed China to take our land.
Whose lies will ensure they keep it.
">Everybody believes in the capability and valour of the Indian army.
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020
Except the PM:
Whose cowardice allowed China to take our land.
Whose lies will ensure they keep it.Everybody believes in the capability and valour of the Indian army.
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020
Except the PM:
Whose cowardice allowed China to take our land.
Whose lies will ensure they keep it.
"భారత సైన్యం శక్తిసామర్థ్యాలు, శౌర్యంపై ప్రధానికి తప్ప ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ఆయన అధైర్యం వల్లే మన భూమిని చైనా ఆక్రమించుకోగలిగింది. ఆయన అబద్ధాలు చెప్పడం చైనాకే లాభం. ఆక్రమించుకున్న భూములను చైనా ఉంచుకోగలదు."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి కేంద్రాన్ని ఒత్తిడిలోకి తోసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా అనేకమార్లు కేంద్రంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
సరిహద్దు వివాదంతో పాటు కరోనా సంక్షోభంపైనా మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది కాంగ్రెస్. వైరస్ కట్టడిలో కేంద్రం దారుణంగా విఫలమైందని.. లాక్డౌన్తో నష్టపోయిన పేదలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఇవీ చూడండి:-