ETV Bharat / bharat

కరోనాపై పోరు: దేశమంతా ఒక్కటై.. దేదీప్యమానమై..

మహమ్మారి కరోనాపై పోరాటానికి దీపాలు వెలిగించి సంఘీభావం చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు ఆసేతుహిమాచలం ఒక్కటై అడుగు వేసింది. నిన్న రాత్రి 9 గంటలకు ఇంట్లో విద్యుత్‌దీపాలు ఆర్పి, కొవ్వొత్తులు, ప్రమిదలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌లు వెలిగించి యావత్‌ భారతావని కరోనాను పారదోలాలన్న బృహత్‌ సంకల్పాన్ని ఐక్యతా బలంతో చాటిచెప్పింది.

PM's call
కరోనా పోరు: దేశమంతా ఒక్కటై.. దేదీప్యమానమై..
author img

By

Published : Apr 6, 2020, 5:34 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు జాతి అపూర్వంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ముందే తమ ఇళ్లలోని లైట్లను ఆపేశారు ప్రజలు. ఆ వెంటనే వాకిళ్లలో, ఆపార్ట్​మెంట్లలోని నడవాల్లో మట్టి ప్రమిదలో నూనె, వత్తులతో కూడిన దీపాలు కళకళలాడాయి. కొందరు కొవ్వొత్తులు వెలిగించారు.

కరోనా పోరు: దేశమంతా ఒక్కటై.. దేదీప్యమానమై..

మరికొందరు తమ మొబైల్​ టార్చ్​లను ఆన్​ చేశారు. ఇలా ఎవరికి వారు తమకు వీలైన విధానంలో దీపాలు వెలిగించి కరోనా వైరస్​పై పోరులో జాతి మొత్తం ఒక్కతాటిపై ఉందన్న సందేశాన్ని చాటిచెప్పారు. కొంతమంది హిందూ సంప్రదాయ గీతాలు పాడారు. కొందరు మంత్రాలు పఠించారు. మరికొందరు జాతీయ గీతాన్ని ఆలపించారు. కంచాలను వాయించడం, శంఖాలను పూరించడం వంటి దృశ్యాలు కనిపించాయి.

దేదీప్యమానం...

ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తుల్లో ఆదివారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు దీపం వెలిగించారు. ఆ దృశ్యాలను ట్విట్టర్​లో పంచుకున్నారు.

దీపావళి...

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆయన సతీమణి సవిత, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన సతీమణి ఉషమ్మ, అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​లు సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా అగ్రనేత ఎల్​ కే అడ్వాణీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇళ్ల ముంగిట దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. అందరూ సామాజిక దూరం పాటించారు. బాణ సంచా వెలుగులు, శబ్దాలతో దీపావళి కొన్ని నెలల ముందుగానే వచ్చినట్లు అనిపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.