భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 4 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే పలు సదస్సుల్లో మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్-ఒ-ఛా ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ బ్యాంకాక్ సందర్శించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు.
పలు సదస్సులకు హాజరు
పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ జరిగే 16వ ఆసియాన్-ఇండియా సదస్సు, 14వ తూర్పు ఆసియా సదస్సు, 3వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుల్లో మోదీ పాల్గొంటారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి బ్యాంకాక్‌లో మంతనాలు జరుగుతున్నాయి. వాటిని సదస్సులో పాల్గొనే దేశాధినేతలు సమీక్షించనున్నారు.