ETV Bharat / bharat

'ఆత్మనిర్భర భారత్​పై ఈనెల 15న మోదీ కీలక ప్రకటన'

ఆత్మనిర్బర్ భారత్​ లక్ష్య సాధనకు సంబంధించిన ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ఆవిష్కరిస్తారని వెల్లడించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్. భారత దేశ ఆత్మగౌరవం, సార్వభౌమత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్న ధ్యేయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టంచేశారు.

PM to present new outline for a self-reliant India on Aug 15: Rajnath Singh
'ఆత్మనిర్బర్ భారత్​కు మోదీ కొత్త నిర్వచనం చెబుతారు'
author img

By

Published : Aug 9, 2020, 7:36 PM IST

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రణాళికల గురించి ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా వివరిస్తారని చెప్పారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. స్వాతంత్ర్య వీరుడు ఉధంసింగ్‌కు నివాళి అర్పించిన సందర్భంగా వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. మోదీ ప్రవచించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ను అమలు చేసేందుకు వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు సింగ్. స్వయం సమృద్ధత లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేమని కరోనా వైరస్‌ తెలియచెప్పిందని అన్నారు. దేశ ఆత్మగౌరవానికి, సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లనీయబోమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

"నవ భారత్ గురించి మాట్లాడితే సమృద్ధి, స్వాభిమాన భారత్‌ అనే గుర్తింపు ఉండాలని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆత్మ విశ్వాసంతో వాటిని సాకారం చేసుకుంటే ఆత్మ నిర్భర్‌ భారత్‌ కూడా సాధ్యం అవుతుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఎలా ఉండాలి అనే దానిపై ఎవరి మనసులోనూ ఎలాంటి సందేహం ఉండరాదు. ప్రజలకు ఆహారం, వస్త్రాలు, ఇల్లు, విద్య, వైద్యం కల్పించడంలో ఆత్మ నిర్భరత సాధించాలి."

-రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి

స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 101 రక్షణ ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు రాజ్​నాథ్​ చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులతో ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్​ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఇక ఆ 101 రక్షణ ఉత్పత్తుల తయారీ భారత్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.