ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​ నివాసులు అందరికీ ఆయుష్మాన్​ భారత్​'

author img

By

Published : Dec 26, 2020, 6:11 AM IST

జమ్ముకశ్మీర్ నివాసులు అందరికీ వర్తించేలా ఆయుష్మాన్ భారత్​ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్​గా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా పాల్గొననున్నారు.

కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​లోని నివాసులు అందరికీ వర్తించే విధంగా ఆయుష్మాన్ భారత్​ పథకాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ పథకం సార్వజనిక ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అందరికీ నాణ్యమైన, అత్యవసర ఆరోగ్య సేవలు తక్కువ ఖర్చులో అందేలా చూస్తుందని పేర్కొంది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్​ సిన్హా​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ పథకంతో నివాసులందరికీ ఉచిత బీమాతో పాటు.. ఫ్లోటర్​ బేసిస్​పై ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆర్థిక రక్షణ ప్రయోజనాలు చేకూరనున్నాయి. దాదాపు 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఈ పథకం ప్రయోజనాలు వీరికి దేశమంతటా వర్తిస్తాయి. ప్రధాన మంత్రి జన్​ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద నమోదైన ఆస్పత్రులు.. ఈ పథకంలోనూ సేవలను అందించనున్నాయి.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.